Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ కు ఇప్పుడైన తెలిసివస్తుందా?

By:  Tupaki Desk   |   11 Jan 2016 11:32 AM GMT
హ‌రీశ్‌ కు ఇప్పుడైన తెలిసివస్తుందా?
X
తెలంగాణ రాష్ర్ట భారీ నీటిపారుద‌ల-శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుకు టీఆర్ ఎస్‌ పార్టీలో ఉన్న స్థాన‌మేంటో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారా? గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న త‌న‌యుడు కేటీఆర్‌ కు పోటీ అని భావిస్తున్న హ‌రీశ్‌ ను ప‌రిమిత బాధ్య‌త‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా త‌త్వం బోధ‌ప‌డేలా చేశారా? అంటే ప్ర‌స్తుత ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి.

హ‌రీశ్ రావుకు టీఆర్ ఎస్ పార్టీలో ట్రబుల్ షూట‌ర్‌ గా పేరుండేది. ఎన్నిక‌లు మొద‌లుకొని పార్టీకి కీల‌కంగా భావించే ప్ర‌తి సంద‌ర్భంలోనూ హ‌రీశ్ అన్నీ భుజాన వేసుకునే వారు. అయితే వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల హ‌రీశ్‌ ను ప‌క్క‌న‌పెట్టేస్తున్నామ‌ని ఇచ్చిన సూచ‌న‌ల‌కు ఇపుడు మ‌రింత బ‌లం చేకూర్చేలా గ్రేట‌ర్ వార్‌ లో కేటీఆర్ బాధ్య‌త‌లు మీద వేసుకోవ‌డం క‌నిపించింది. హైద‌రాబాద్‌ లో గులాబీ జెండా ఎగరేయ‌డం కోసం కేటీఆర్‌ ను అంత‌టా తిప్పుతున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ - హ‌రీశ్‌ రావును ఒక్క స్థానానికే ప‌రిమితం చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే అడ్డ‌గుట్ట డివిజన్ బాధ్య‌త‌ల‌ను హ‌రీశ్‌ కు అప్ప‌జెప్పారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌ ప‌రిధిలోకి 20 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా ఏదో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా బాధ్యుడిగా వేయ‌కుండా మిగ‌తా మంత్రులు/నాయ‌కుల లాగా "డివిజ‌న్‌"కు ప‌రిమితం చేయ‌డంపై టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో ఆయా ఎన్నిక‌ల‌ను భుజాన వేసుకున్న హ‌రీశ్‌ ను ఇపుడు డివిజ‌న్‌ కు మాత్ర‌మే పరిమితం చేయ‌డం అంటే పార్టీలో ఆయ‌నకు ద‌క్కుతున్న ప్రాధాన్య‌త‌కు చిహ్న‌మ‌ని చెప్తున్నారు. రాజ‌కీయ వార‌సుడిగా నిల‌బెట్టే క్ర‌మంలో హ‌రీశ్‌ కు త‌న ప‌రిధిని ప‌రోక్షంగా చెప్పిన‌ట్లయింద‌ని గులాబీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా హరీష్ మొహంలో ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం కాలేదంటే.. ఆయన వ్యూహాలేంటో మరి!