Begin typing your search above and press return to search.
దూకుడు మరీ ఎక్కువైనట్లుంది హరీశా?
By: Tupaki Desk | 8 Jun 2016 4:46 AM GMTచేతిలో అధికారం ఉంటే అదే పెద్ద చిక్కుగా మారుతుంది. విపక్ష నేతలుగా ఉన్నప్పుడు ప్రజలే ఫైనల్ అని.. వారి వాదనే కరెక్ట్ అని వాదించే నేతలకు భిన్నంగా అధికారపక్ష నేతల తీరు ఉంటుంది. నిజానికి అదే పెద్ద తప్పుగా ఉంటుంది. విపక్ష నేతలుగా ఉన్నప్పుడు ప్రజల పక్షపాతిగా నిలిచే నేతలు.. పవర్ చేతికి రాగానే వారి మాటలు.. చేతలు మారిపోతుంటాయి. ప్రజల ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా వారి శైలి ఉంటుంది.
కానీ.. పవర్ చేతిలోకి రాగానే.. వారి ప్రాధామ్యాలు మారిపోతాయి. తాము ఇచ్చిన హామీల్ని వాయువేగంతో పూర్తి చేయాలన్న తపనో.. తొందరపాటో కానీ ఏ మాటలు అయితే నేతల నోట్లో నుంచి రాకూడదో అదే తరహాలో మాట్లాడుతుంటారు. తాజాగా అలానే వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. తాజాగా మల్లన్నసాగర్ ముంపు నిర్వాసితుల వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద ఇష్యూగా మారింది. ముంపు ప్రాంత రైతులు ప్రభుత్వం తమకిచ్చే పరిహారం తక్కువగా ఉందని.. దాన్ని మరింత పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి ఈ మాటలన్నీ హరీశ్ విపక్షంలో ఉన్నప్పుడు రైతుల నోటి నుంచి వచ్చి ఉంటే ఆయన స్పందన మరోలా ఉండేదేమో. ఇప్పుడేమో హరీశ్ మంత్రి కావటంతో ఆయన మాట మారిపోయింది. మల్లన్నసాగర్ ముంపు నిర్వాసితుల విషయంలో ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్న ఆయన.. జీవో నెంబరు 123 ద్వారా నష్టపరిహారం అందిస్తున్నట్లుగా చెప్పారు. నిజానికి ఈ జీవో ప్రకారం ఇస్తున్న పరిహారం మీద సదురు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కలుగజేసుకున్న మంత్రి హరీశ్ రావు నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. జీవో 123ప్రకారం ఇస్తామన్న నష్టపరిహారాన్ని రైతులు తీసుకోవాలని.. కాదని కోర్టుకు వెళితే ఈ వ్యవహారం తేలేందుకు మూడేళ్లు పడుతుందన్నవిషయాన్ని గుర్తు ఉంచుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రేమతో జీవో 123తో మేలు చేస్తామంటే రైతులు అర్థం చేసుకోవాలని.. లేదంటే 2013 భూసేకరణ చట్టంతో భూమిని తీసుకోవటానికి సిద్ధమేనని తేల్చేశారు. హరీశ్ మాటల్లోని ఈ దూకుడుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ప్రాంతాలకు చెందిన రైతుల ఆందోళలను సానుకూలత వ్యక్తం చేసి.. వారిని సమాధాన పరిచి భూములు సేకరించాల్సిన హరీశ్ అండ్ కో అందుకు భిన్నంగా పవర్ మాటలు మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పినట్లుగా.. చెప్పిన మొత్తాన్ని నష్టపరిహారంగా తీసుకోవాలన్న మొండి మాటల్ని వదిలేసి.. రైతుల కోణంలో ఆలోచించి.. వారిని నొప్పించకుండా భూములు తీసుకునే పని చేయటం బాగుంటుంది. అందుకు భిన్నంగా చేసే వ్యాఖ్యలు ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచుతాయన్న విషయాన్ని హరీశ్ మర్చిపోకూడదు. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటం హరీశ్ లాంటి వారికి తగదన్న మాట వినిపిస్తోంది.ఈ విమర్శను హరీశ్ ఎంత సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. ప్రభుత్వ విధానాల మీద ఆందోళన చేసే వారి విషయంలో బుజ్జగింపులతో సమస్యకు పరిష్కారం వెతకాలే కానీ.. దూకుడు మాటలతో తాము అనుకున్నది పూర్తి చేయాలనుకోవటం పెద్ద తప్పు అన్న విషయాన్ని హరీశ్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. మరి.. తన దూకుడును హరీశ్ తగ్గిస్తారా..? చేతిలో ఉన్న అధికారం ఆయన్ను తగ్గేలా చేస్తుందా..?