Begin typing your search above and press return to search.
ముంబై టు సిద్ధిపేట వయా హైదరాబాద్
By: Tupaki Desk | 22 May 2017 5:40 PM GMTతెలంగాణ మంత్రి హరీశ్ రావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హైదరాబాద్ మోడల్‌ను కాపీ కొట్టారు. తద్వారా తన ఇలాకా అయిన సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపును దక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ హరీశ్ రావు ఏం చేస్తున్నారంటే...ఇటీవల హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో `లవ్ హైదరాబాద్` అనే సింబల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న ఇలాంటి చిహ్నం ఆధారంగా లవ్ హైదరాబాద్ సింబల్ తీర్చిదిద్దారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సింబల్‌ను సిద్ధిపేటలో ఏర్పాటు చేసేందుకు హరీశ్ సిద్ధమయ్యారు.
సిద్దిపేటలోని కోమటి చెరువును ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు హరీశ్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెరువు చుట్టూ రింగు రోడ్డు మాదిరిగా కట్టను నిర్మించాలని, చెరువులో జెట్ పంపులు, ఫౌంటెన్ల ఏర్పాటు, బతుకమ్మ ఘాట్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు ఇటీవల నిధులు మంజూరు చేశారు. దానికి తోడు చెరువు కట్టపై 'లవ్ సిద్దిపేట' సింబల్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. తాజాగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన హరీశ్‌రావు అక్కడ లవ్ సిద్దిపేట సింబల్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. కోమటిచెరువు ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని, పార్క్ నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా,మార్నింగ్ వాక్‌కు వెళ్లి ప్రజలతో ముఖాముఖి సమావేశమైన హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.