Begin typing your search above and press return to search.

50 లక్షలు ఫైన్ కట్టిన హరీష్ రావు.. ఏంచేశారంటే

By:  Tupaki Desk   |   2 Nov 2019 7:26 AM GMT
50 లక్షలు ఫైన్ కట్టిన హరీష్ రావు.. ఏంచేశారంటే
X
తెరాస లో ఉండే కీలక నేతలలో ఒకరు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న T హరీష్ రావు రాజకీయాలపై మంచి పట్టున్న నేతగా మంచి గుర్తింపు ఉంది. పార్టీ కి ఏ సమయంలో ఎటువంటి అవసరం వచ్చినా నేను ఉన్న అంటూ వచ్చే నేత హరీష్ రావు. ఎన్నో కీలక సందర్భాలలో ..తన చాకచక్యం తో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పార్టీ ని విజయపథంలో నడిపించారు. అలాగే గతంలో జరిగిన ఎన్నికలలో దేశంలోనే అత్యధికమైన భారీ మెజారిటీ తో విజయం సాధించారు. పేకపోతే అలాంటి హరీష్ రావు తాజాగా ఒక తప్పు చేశారు. అందుకు ఆయనకు ఆయనే జరిమానా కూడా విధించుకున్నారు. జరిమానా రూపంలో ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 లక్షల రూపాయల జరిమానా విధించుకున్నారు.

ఇంతకీ హరీష్ రావు చేసిన తప్పేంటి. ఆయన ఎందుకు జరిమానా విధించుకున్నారు.. అంటే తన్నీరు హరీష్ రావు తన సొంత జిల్లా అయిన సిద్దిపేటలో ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో మంత్రి హరీష్ రావు మహిళలకు మెప్మా రుణాలు అందించటానికి, చెత్త బుట్టల పంపిణీ చేయడానికి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మంత్రి హరీశ్‌ రావు ఆ కార్యక్రమంలో పాల్గొని, అక్కడ నిర్వహిస్తున్న సభలో మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు అని చెప్పారు. కానీ , అయన సరైన సమయానికి రాలేకపోయారు. ఆ తరువాత మధ్యాహ్నం 3. 30 నిమిషాలకి సభకి విచ్చేసారు. సభకు రాగానే ఉదయం పదకొండున్నర నుండి తన రాక కోసం ఎదురు చూస్తున్న మహిళలకు మంత్రి హరీష్ రావు క్షమాపణ చెప్పారు.

నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని అడిగారు. అంతేకాదు తనకు తాను, తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జరిమానా కూడా విధించుకున్నారు. తన కోసం ఎదురుచూస్తున్న మహిళలతో ఆలస్యానికి క్షమించమని, పరిహారంగా తనకు జరిమానా విధించమని కోరారు మంత్రి హరీష్ రావు. అయితే మహిళలు మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీంతో హరీష్ రావుమహిళా భవన నిర్మాణానికి యాభై లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పి తనకు తాను పరిహారం చెల్లించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఈ బాధ్యత తనకు తాను జరిమానాగా విధించుకున్నానని సభా ముఖంగా తెలిపారు హరీష్ రావు. ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చినా పరిహారంగా తాము కోరిన మహిళా భవనాన్ని మంజూరు చేసిన హరీష్ రావు కు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. వెంటనే ఈఎన్‌సీ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి.. నిధులను మంజూరు చేయించాలని ఆదేశించారు. రాజకీయాలకి ఇంకా కాస్తో కూస్తో గౌరవం ఉంది అంటే ఇలాంటి నేతల వల్లే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.