Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే... హరీష్ కొత్త అర్ధం!

By:  Tupaki Desk   |   12 Oct 2016 4:26 AM GMT
కేసీఆర్ అంటే... హరీష్ కొత్త అర్ధం!
X
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ప్రారంభిస్తున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని సిద్ధిపేట అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా... సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లే సమయంలో సిద్ధిపేట ఏమవుతుందోనని తాను బాధ పడినట్లుగా వెల్లడించారు. అయితే.. హరీశ్ రావు కూడా ఏమాత్రం తగ్గకుండా తనకు ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా, సిద్ధిపేటను ఏకంగా స్వర్గసీమ చేస్తున్నారన్నారు. తన గురించి ఈ మధ్యాకాలంలో పెద్దగా ప్రస్థావించడం కాని, ఈ రేంజ్ లో పొగడటం కానీ కేసీఆర్ చేయకపోవడంతో హరీష్ కూడా తనదైన శైలిలో కేసీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా స్పందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ పై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ గురించి మాట్లాడిన హరీష్... కేసీఆర్ అనే అక్షరాలకు కొత్త అర్ధం చెప్పారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని తనదైన కొత్త అర్ధం చెప్పారు. K - Knowledge (జ్ఞానము), C - Commitment (నిబద్ధత), R - Reconstruction (పునర్నిర్మాణం) అని కేసీఆర్ ని కొనియాడారు. ఈ మూడింటిని నిజం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి శిరసు వంచి హరీష్ పాదాభివందనం చేశారు. ఇక సిద్ది పేట గురించి మాట్లాడే క్రమంలో కేసీఆర్ వద్ద సిద్దిపేట గురించి మాట్లాడుతుంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ లో కేసీఆర్ - హరీష్ లు ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లులు కురిపించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/