Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను తెగ పొగిడేసిన మంత్రి హరీశ్
By: Tupaki Desk | 24 Jan 2017 5:17 PM GMTతెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ఆయన మేనబావ,నీటి పారుదల, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ సేల్స్ ఫోర్స్ కార్యాలయన్ని గచ్చిబౌలిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఐటీ కంపెనీలను నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.ఐటీ రంగంలో రూ. 70 వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో ఎగుమతులను రూ. లక్ష కోట్లకు చేరుస్తామని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందుందన్నారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కేటీఆర్ పనితీరే నిదర్శనమని కొనియాడారు.
కావేరి నది జలాల వివాదం, జల్లికట్టు గురించి జరుగుతున్నా ఆందోళనల వలన ఆ రాష్ట్ర లలో ఐటీ కంపెనీ లు తెరుచుకొని పరిస్థితి కానీ తాము ఐటీ కంపెనీలను ఎప్పుడు ఇబ్బందుల పాలు చేయలేదని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం లో మేము ఐటీ పరిశ్రమలకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉద్యమం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కంపెనీలపై ఒక్క రాయి కూడా పడలేదని తెలిపారు.
సేల్స్‌ఫోర్స్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. సేల్స్‌ఫోర్స్‌కు ప్రభుత్వ సహకారం ఉంటుందని, భవిష్యత్ లో కూడా అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
ఇదిలాఉండగా.....సేల్స్ ఫోర్స్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన సేల్స్ ఫోర్స్ కంపెనీ హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంపెనీలు వచ్చే అవకాశం లేదన్నారని అయితే వాటన్నింటికీ అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు నేడు హైదరాబాద్ గమ్యస్థానమైందని కేటీఆర్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/