Begin typing your search above and press return to search.
కేటీఆర్ అదుర్స్ అంటున్న హరీశ్ రావు
By: Tupaki Desk | 17 Jun 2017 10:36 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరు? అనే ప్రశ్నకు ఎప్పటికప్పుడు విశ్లేషణలు, విమర్శలు, వివరణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గులాబీ దళపతి కేసీఆర్ తన కుమారుడైన మంత్రి కేటీఆర్‌కు తన పగ్గాలు అప్పగించనున్నారని, ఈ క్రమంలో మేనల్లుడు హరీశ్ రావును పక్కన పెడుతున్నారని రాజకీయ వర్గాల్లో సుదీర్ఘ కాలంగా చర్చ జరుగుతోంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు బావ, బావమరుదులైన హరీశ్ రావు - కేటీఆర్ లు తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ మధ్య పొరాపొచ్చాలు ఏమీ లేవని వివరిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుకు మంత్రులు కేటీఆర్ - హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
శంఖుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ సహచర మంత్రి అయిన తన బావమరిదిపై పొగడ్తల వర్షం కురిపించారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తెలంగాణను ఇండస్ట్రీయల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఎందరో ముందుకు వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రమ వల్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుతో వేలాది ఉద్యోగ - ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతే కాకుండా వైద్యం కూడా తక్కువ ధరలో అందుతుందన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. ఉద్యమంలో ప్రదర్శించిన స్ఫూర్తినే రాష్ర్టాభివృద్ధి కోసం కూడా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
కాగా , దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి వైద్య పరికరాల తయారీ పార్క్ హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెర్వు మండలం సుల్తాన్ పూర్ లో వైద్య పరికరాల తయారీ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో అత్యాధునిక వసతులతో 250 ఎకరాల్లో వైద్య పరికాల తయారీ పార్క్ ఏర్పాటు జరుగుతుంది. పలు అంతర్జాతీయ సంస్థలు రూ. 50 వేల కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. దాదాపు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/