Begin typing your search above and press return to search.
నిజమే.. షబ్బీర్ ను పొగిడేసిన హరీశ్
By: Tupaki Desk | 19 Dec 2016 4:01 PM GMTమిగిలిన రాజకీయ పార్టీలకు తెలంగాణ అధికారపక్షానికి ఓ పెద్ద వ్యత్యాసం ఉందని చెబుతుంటారు. దూకుడుగా దుమ్మెత్తిపోయటం.. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దునుమాడటంలో ఆ పార్టీ నేతల తర్వాతే ఎవరైనా. మాట వరసకైనా ప్రత్యర్థి పార్టీ నేతల్ని పొగిడేసే తీరు అస్సలు కనిపించదు. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి లాంటి సీనియర్ నేతను సైతం పొగిడేసే క్రమంలో కాసింత ఎటకారం చేసుకోవటం కనిపిస్తుంది.
అలాంటిది.. తమ వైఖరికి భిన్నంగా తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ ముఖ్యమంత్రి మేనల్లుడు హరీశ్ రావు నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. షబ్బీర్ అలీ అనుభవం ఉన్న నేత అని.. ఆయన మాటలు చూసినప్పుడు ఎంత అనుభవం ఉన్నదన్న విషయం తెలీటంతో పాటు.. ఆయన మాటలు కుండ బద్ధలు కొట్టినట్లగా ఉంటాయన్నారు.
విపక్షంలో ఉన్న నాయకులు ఎంత ఎక్కవ మాట్లాడితే అంత బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హరీశ్.. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష నేతల్ని తాము గౌరవిస్తామన్నారు. విపక్షంలో ఉన్నప్పుడే నాయకుడు పరిపక్వత సాధిస్తారన్న ఆయన.. షబ్బీర్ అలీ ఇటీవల కాలంలో చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హరీశ్.. విపక్ష నేతను పొగిడేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/