Begin typing your search above and press return to search.

దిశ హత్య : తల్లిదండ్రులని హెచ్చరించిన మంత్రి హరీష్ రావు?

By:  Tupaki Desk   |   3 Dec 2019 1:29 PM GMT
దిశ హత్య : తల్లిదండ్రులని హెచ్చరించిన మంత్రి హరీష్ రావు?
X
దిశ హత్య ప్రస్తుతం నేషనల్ వైడ్ గా సంచలనం గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే ఉదంతం పై చర్చించుకుంటున్నారు. అమాయకమైన మూగజీవాలకి చికిత్స చేయాలని దిశ ఇంటి నుండి వెళ్తే .. వచ్చే దారిలో మాటువేసి ..నోరున్న మృగాళ్లు అతి కిరాతకంగా రేప్ చేసి - హత్య చేసి - పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇలాంటి నేరస్తులు ఉరి తీసి చంపాలని కొందరంటే - అరబ్ దేశాలలాగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నరికి చంపాలని మరికొందరు చెబుతున్నారు.

ఇక తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ దిశ ఉదంతం పై తనదైన రీతిలో అందరినీ ఆలోచింపజేసేలా స్పందించారు. హరీష్ రావు మాట్లాడుతూ అమ్మాయిలపై అఘాయిత్యాలు అత్యంత బాధాకరమని - దిశపై అఘాయిత్యం ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని హరీశ్ రావు తెలిపారు. ఇక పాఠశాల స్థాయి నుండే అమ్మాయిలు తమను తాము రక్షించుకునే విధంగా నెలలో ఒకసారి శిక్షణ ఇవ్వాలని అన్నారు.

అలాగే ముఖ్యంగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని - ముఖ్యంగా మగపిల్లలకు విద్యతో పాటు విలువలు - సంస్కారంతో కూడిన నడవడికను నేర్పించాలని చెప్పారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా ఎక్కువగా మగపిల్లలపై దృష్టి పెట్టాలని - వాళ్ళని సక్రమంగా పెంచాలని హరీష్ రావు అన్నారు. వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాలను గమనిస్తూ వుండాలని తల్లిదండ్రులకు సూచించారు. సిద్ధిపేటలోని ప్రభుత్వం బాలికల పాఠశాలలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార సేవా కార్యక్రమానికి వచ్చిన హరీష్ రావు ..దిశ ఉదంతం పై ఈ విధంగా స్పందించారు.