Begin typing your search above and press return to search.

కేసీఆర్ దార్లోకి వచ్చినా హరీశ్ లో అసంతృప్తే..

By:  Tupaki Desk   |   30 Nov 2016 10:59 AM GMT
కేసీఆర్ దార్లోకి వచ్చినా హరీశ్ లో అసంతృప్తే..
X
మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తొలినాళ్లలో అసంతృప్తి వ్యక్తంచేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీలో మోడీతో భేటీ... మళ్లీ మోడీ హైదరాబాద్ వచ్చిన తరువాత ఎయిర్ పోర్టులో రెండుసార్లు ఆత్మీయ ఆంతరంగిక మంతనాల తరువాత మెత్తబడ్డారు. కేంద్రానికి సహకరించేలా, తెలంగాణలో వ్యాపారాలు సాగేలా టీ వ్యాలట్ ప్రవేశపెట్టేందుకు యుద్ధప్రాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి మోడీ నుంచి ఏం హామీ తీసుకున్నారో ఏమో కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మోడీ దార్లోకి వచ్చినట్లుగా క్లియర్ గా అర్థమైంది. అయితే... కేసీఆర్ సైలెంటు అయిపోయినా ఆయన మేనల్లుడు - తెలంగాణ మంత్రి హరీశ్ మాత్రం తన కడుపులోని మంటను ఆపుకోలేకపోతున్నారు. నిర్మొహమాటంగా దాన్ని బయటకు వెళ్లగక్కేస్తున్నారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఆర్థిక సంక్షోభం ఉత్ప‌న్న‌మై ప్ర‌జా తిర‌గుబాటు త‌ప్ప‌ద‌ని తొలుత విరుచుకుపడిన కేసీఆర్ ఆ వెంట‌నే త‌న అభిప్రాయాన్ని మార్చుకున్నారు. త‌రువాత టీఆర్ ఎస్ పార్టీ కూడా ఈ అంశంపై పార్ల‌మెంటులో నోరు మెద‌ప‌లేదు. టీఆరెస్ నేతలెవరూ దీనిపై అసలు మాట్లాడడమే లేదు. కేసీఆర్ ఆదేశాల కారణంగానే ఆ పార్టీ నేతలంతా సైలెంటుగా ఉన్నారు. కానీ... హ‌రీశ్ రావు త‌న మ‌న‌సులో కోపాన్ని ఏమాత్రం దాచుకోవడం లేదు. పెద్ద‌నోట్లు రాష్ట్ర అభివృద్ధికి శ‌రాఘాతంగా మారింద‌ని ఆయన తాజాగా వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టానికి కొత్త‌ ప్రాజెక్టులు రావ‌డం లేద‌ని... వ‌చ్చిన ప్రాజెక్టుల్లో ప‌నులు నిలిచిపోయాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/