Begin typing your search above and press return to search.
హరీశ్ ఎదుట ‘ఆంధ్రోళ్ల’ను అనేసిన రైతు
By: Tupaki Desk | 9 Sep 2016 5:28 AM GMTతెలంగాణ రాష్ట్ర సర్కారులో ఫైర్ బ్రాండ్ నేతల్లో మంత్రి హరీశ్ ఒకరు. ఆయననోరు విప్పితే మాటలు ఎంత ఘాటుగా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుగు ప్రజలందరికి సుపరిచితమే. ఆకట్టుకునేలా మాట్లాడటంతో పాటు.. తన ప్రతి మాటకు లాజిక్ మిస్ కాకుండా చూసుకునే లక్షణం హరీశ్ లో కనిపిస్తుంది. ఘాటైన మాటలే కాదు.. ఆంధ్రాపాలకులు అంటూ తరచూ ఆయనచేసే వ్యాఖ్యలు సీమాంధ్రులకు చిరాకు తెప్పించినా.. తెలంగాణ ప్రాంతవాసుల మనసుల్ని దోచుకుంటారని చెప్పొచ్చు.
తెలంగాణ ప్రయోజనాల గురించి గుక్క తిప్పుకోకుండా మాటలు చెప్పే హరీశ్.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల సర్కారు కారణంగా తెలంగాణకు జరిగి అన్యాయం గురించి తరచూ ప్రస్తావించే హరీశ్ ఎదుట ఆంధ్రా పాలకుల్ని తిడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు. ‘ఆంధ్రోళ్లు’ అంటూ తనకంటే ఘాటుగా రియాక్ట్ అయ్యే వారి విషయంలో హరీశ్ స్పందన ఎలా ఉంటుందన్న అంశం తాజాగా ఎదురైంది.
మహబూబ్ నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2..3 లిఫ్టులను గురువారం హరీశ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల తీరును తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1990లో నెట్టెంపాడు.. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ కు శంకుస్థాపనలు చేసినప్పటి నుంచీ టీడీపీ హయాంలో చంద్రబాబు.. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టేందుకే పరిమితమయ్యారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కల్వకుర్తి ప్రాజెక్టులో మాటలు ఏరులై పారాయని.. నీళ్లు పారలేదని.. టీఆర్ ఎస్ సర్కారు హయాంలో కల్వకుర్తిలో నీళ్లు పారాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఏపీ సర్కారు అడ్డుకుంటోందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హరీశ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ తిరిగి వెళ్లే సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జొన్నలబొగుడ లిఫ్టు ప్రారంభించిన తర్వాత తిరిగివెళ్లే క్రమంలో అక్కడే ఉన్న రైతును హరీశ్ పలుకరించారు. కేఎల్ ఐ ద్వారా మీ ప్రాంతానికి నీళ్లు అందాయికదా అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆంధ్రోళ్ల పాలనలో పనులేమీ జరగలేదు. టీఆర్ ఎస్ వచ్చాక వేగంగా పని పూర్తి అయి నీళ్లు అందాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ల పాలనలో ఏం జరగలేదన్న మాట సగటు రైతు నోటి విన్న హరీశ్.. చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. అంతకు మించి హరీశ్ కు కావాల్సిందేముంది?