Begin typing your search above and press return to search.

హ‌రీశ్ కామెంట్‌!... నో ఛాన్స్ - నో ప్రాబ్లెం!

By:  Tupaki Desk   |   19 Feb 2019 9:27 AM GMT
హ‌రీశ్ కామెంట్‌!... నో ఛాన్స్ - నో ప్రాబ్లెం!
X
తెలంగాణ‌లో కొత్త కేబినెట్ కొలువు దీరింది. కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో రెండో ద‌ఫా టీఆర్ ఎస్‌ కు అధికారం చేజిక్కగా.. సీఎంగా ఆ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు - డిప్యూటీ సీఎంగా మ‌హ‌మూద్ అలీలు మాత్రం ప్ర‌మాణం చేశారు. ఇది జ‌రిగి నేటికి 66 రోజులు కావ‌స్తోంది. అయితే కేబినెట్ విస్త‌ర‌ణ‌పై చాలా గుంభ‌నంగానే వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్‌... ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ లో ఓ ప‌ది మంది మంత్రుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. కాసేప‌టి క్రితం గ‌ర‌వ్న‌ర్ ఈఎస్ ఎల్ న‌రసింహ‌న్ కేసీఆర్ స‌మ‌క్షంలోనే కొత్త మంత్రుల‌తో ప్ర‌మాణస్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ ఎస్‌ కు చెందిన కీల‌క నేత‌లంద‌రితో పాటుగా కేసీఆర్ మేన‌ల్లుడు - గత కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన త‌న్నీరు హ‌రీశ్ రావు కూడా హాజ‌రయ్యారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కున్నా... త‌న‌లోని అసంతృప్తిని ఏమాత్రం బ‌య‌ట‌పెట్ట‌కుండానే చాలా సంతోషంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన హ‌రీశ్... మొత్తం కార్య‌క్ర‌మానికే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలిచారు.

మంత్రుల ప్ర‌మాణ స్వీకారం ముగిసిన త‌ర్వాత అక్క‌డి నుంచి బ‌య‌లుదేరుతున్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన హ‌రీశ్... త‌నదైన మంచి గుణాన్ని చాటుకున్నారు. అవ‌కాశాలు వ‌స్తేనే ప‌నిచేస్తాం... లేదంటే వేరే దారి చూసుకుంటామంటున్న నేత‌లున్న ఈ కాలంలో... అవ‌కాశం ద‌క్క‌క‌పోయినా పార్టీలో ఓ క్ర‌మ‌శిక్ష‌ణ క‌గిలిన కార్య‌క‌ర్త‌గా పార్టీ అధిష్ఠానం - అధినేత ఆదేశించే బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌డ‌మే త‌న ప‌ని అని చెప్పిన హ‌రీశ్... త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని వైనంపై వెల్లువెత్తుతున్న ప‌లు ర‌కాల క‌థ‌నాల‌ను సింగిల్ కామెంట్‌ తో కొట్టి పారేశారు. కొత్త మంత్రుల‌కు శుభాకాంక్ష‌ల‌తు చెబుతూనే... త‌న ముందున్న క‌ర్త‌వ్యం ఏమిటన్న విష‌యాన్ని హ‌రీశ్ రావు చాలా క్లారిటీగా చెప్పేశారు. మొత్తంగా అవ‌కాశాలు వ‌స్తే మాత్ర‌మే ప‌నిచేస్తాన‌నే ర‌కం తాను కాద‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. అభినంద‌న‌లు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారీ నాయ‌క‌త్వంలో ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌ను - తెలంగాణ‌ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌నకు అనుగుణంగా ప‌ని చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తార‌ని ఆశిస్తున్నాను. ముఖ్య‌మంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు.. ఎన్నిక‌ల‌కు ముందు చాలా సార్లు చెప్పాను. టీఆర్ ఎస్‌ లో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన ఓ సైనికుడి లాంటి కార్య‌క‌ర్త‌ను. పార్టీ - గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే.. దానిని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాన‌ని ఇప్ట‌పికే ప‌దుల సార్ల‌లో చెప్ప‌డం జ‌రిగింది. సో... ముఖ్య‌మంత్రి గారు ఆయా ప్రాంతాలు - వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్య‌త అప్ప‌గించినా కూడా ఒక క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌గా అమ‌లు చేస్తాను. నాకు అసంతృప్తి అన్న మాటే లేదు. దీనిపై ఎవ‌రైనా సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తే కూడా దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సోష‌ల్ మీడియాలో నా పేరు మీద ఎలాంటి గ్రూపులు కూడా లేవు* అంటూ ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ దెబ్బ‌తో హ‌రీశ్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని వైనంపై సోష‌ల్ మీడియాలో ఊహాగానాల‌తో కూడిన వార్త‌ల‌కు చెక్ ప‌డిపోవ‌డం ఖాయమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.