Begin typing your search above and press return to search.
వీఐపీలకు కోత పెట్టారే !
By: Tupaki Desk | 26 Dec 2015 4:47 AM GMTకార్యక్రమం ఏదైనా.. వీఐపీలు వస్తున్నారంటే చాలు.. వారికి రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతారు. అందుకు భిన్నమైన పరిస్థితి అయుత చండీయాగం సందర్భంగా చోటు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడో రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించిన దానికంటే భారీగా ప్రజలు పోటెత్తారు. అదే సమయంలో వీఐపీలు సైతం అనుకున్న దాని కంటే ఎక్కువగా రావటం.. వారితో పాటు బంధువుల్ని.. ముఖ్యల్ని తీసుకురావటం యాగం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. వీఐపీల సంఖ్య పెరిగితే ఎన్ని చిక్కులన్న విషయం వారికి అర్థమైంది.
అందుకే.. వీఐపీల ఉత్సాహానికి కళ్లాలు వేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. యాగానికి వస్తే వీఐపీలు నియంత్రణ పాటించాలని కోరారు. యాగానికి వచ్చే వారు వీలైనన్ని తక్కువ వాహనాల్లో రావాలని చెప్పటమే కాదు.. వీఐపీలు తమతో తీసుకొచ్చే వారి సంఖ్య విషయంలోనూ ఎంతమంది రావాలో స్పష్టం చేశారు. యాగానికి వచ్చే వీఐపీలు తమతో నలుగురు లేదంటే ఐదుగురికి మించకుండా రావాలని కోరటం గమనార్హం.
సాధారణంగా వీఐపీల విషయంలో ఆంక్షలు విధించటం.. నియంత్రణతో వ్యవహరించమని కోరటం లాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే.. చండీయగానికి పోటెత్తుతున్న భక్త జనసందోహం నేపథ్యంలో.. వీఐపీల రాక కలిగిస్తున్న ఇబ్బందిని గుర్తించిన కేసీఆర్ అండ్ కో.. వారికి చెక్ చెప్పేందుకే హరీశ్ తాజాగా ప్రకటన చేసినట్లుగా చెబుతున్నారు. యాగానికి మీ ఫ్యామిలీ అంతా తప్పక రావాలంటూ పిలిచిన వారే.. నలుగురికి మించి రావొద్దని చెప్పటం చూస్తే యాగానికి వచ్చే భక్తజన సందోహం.. వీఐపీల హడావుడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.