Begin typing your search above and press return to search.
ఇవన్నీ మేనమామకు చెప్పే చేస్తున్నావా హరీశ్?
By: Tupaki Desk | 19 April 2019 4:56 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొన్ని విషయాల్లో మహా అనుమానాలుగా చెబుతుంటారు. మిగిలిన వాటిని పక్కన పెడితే.. తన మేనల్లుడు వేసే ప్రతి అడుగుకు సంబంధించి ఆరాలు తీస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అది ప్రేమ మీదనో.. మరేదైనా కానీ.. ఆ అలవాటే మేనల్లుడికి మంచి పదవి అప్పజెప్పేందుకు వీలుగా ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ఉన్నట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తుంటారు.
ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వేళ.. నా మేనల్లుడు తోపు అని చెప్పిన కేసీఆర్.. కాలక్రమంలో మేనల్లుడు చూసే శాఖను తన దగ్గరే ఉంచేసుకోవటం విశేషంగా చెప్పాలి. దీంతో.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మంచి పట్టున్నప్పటికీ.. హరీశ్ మౌనంగా ఉండిపోయినట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 10 కింద చేపట్టిన పనుల మీద సమీక్ష జరిపిన హరీశ్ తీరు ఆసక్తికరంగా మారింది.
తాను ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేటలో ఆయన ఇరిగేషన్ అధికారుల్ని పిలిపించుకొని.. రంగనాయక.. అనంతగిరి రిజర్వాయర్ పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్న హరీశ్.. రంగనాయక సాగర్ కింద టన్నెల్ లో మిగిలిన 110 మీటర్ల లైనింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని.. సర్జిపూల్ పనులు మే చివరికి కంప్లీట్ కావాలని చెప్పారు.
పనులు పెండింగ్ కు కారణమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ తరహా సమీక్షలు మామ కేసీఆర్ కు చెప్పే చేస్తున్నారా హరీశ్? అన్న డౌట్ రాక మానదు. అసలే మేనమామకు పుట్టెడు సందేహాలుగా చెబుతున్న వేళ.. ఇలాంటివేళలో తనకు దూరమైన ఇరిగేషన్ రివ్యూ చేపట్టటం.. దానికి కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరేరామ్.. లాంటి పెద్ద స్థాయి అధికారులు రావటం ఎలా ఉంటుందో చూసుకున్నారా హరీశ్? అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వాటిని హరీశ్ గమనిస్తున్నారా?