Begin typing your search above and press return to search.
జగన్‌కు కేంద్రం అందుకే డబ్బులిచ్చింది.. షరీష్ రావు సంచలన కామెంట్లు
By: Tupaki Desk | 6 March 2022 12:30 AM GMTఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిందని.. ఆ డబ్బులు తెచ్చుకుని మోటార్లకు మీటర్లు పెట్టారని.. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చిందని తెలిపారు.
కేంద్రం చెప్పిన దానికి తల ఊపి.. ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో మోటర్లకు మీటర్లు పెట్టిందని వెల్లడించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం.. మోటర్లకు మీటర్లు పెట్టేదిలేదని తేల్చి చెప్పారని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో హరీష్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ భూమి కొని బోరువేసి మహారాష్ట్రలో పంటలకు నీరు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు. మీ దగ్గరకు వచ్చే బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని.. కేంద్రానికి దుర్మార్గులు లేఖ రాశారన్నారు. బీజేపీ నాయకులు రేపో, మాపో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నారన్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని.. కేంద్రప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటోందని హరీష్‌రావు విమర్శించారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత.. సీఎం కేసీఆర్కే దక్కుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు.
రైతు బంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ చేసినట్లు హరీశ్ అన్నారు. పైరవీలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో దళారులు, మధ్యవర్తులే లాభపడ్డారని విమర్శించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తో పాటు.. నీటి తీరువా లేకుండా కాలువ నీరిచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని స్పష్టం చేశారు. పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.9 వేల కోట్లు ఇచ్చినట్లు వివరించారు.