Begin typing your search above and press return to search.

ఏపీతో ‘జల’ఫైట్.. రంగంలోకి హరీష్

By:  Tupaki Desk   |   13 May 2020 11:10 AM GMT
ఏపీతో ‘జల’ఫైట్.. రంగంలోకి హరీష్
X
ఇన్నాళ్లు అన్నాదమ్ముళ్ల వలే ఉన్న కేసీఆర్-జగన్ ల మధ్య జల జగడం మొదలైంది.. శ్రీశైలం జలాశయంపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేసింది.దీనిపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టుకు ఎక్కుతామన్నారు.

తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ఈ ఏపీ ఎత్తిపోతలను అడ్డుకోవడానికి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇక పోయిన సారి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావు సైతం ఇప్పుడు ఈ ఫైట్ లోకి ఎంటర్ అయ్యారు.

జగన్ సర్కారు శ్రీశైలంలోని 805 అడుగుల ఎత్తులో లిఫ్ట్ పెడుతుండడం.. నిజంగా తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టేనని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు మొత్తం నీటిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఉన్నత స్థాయి కమిటీ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని హరీష్ రావు మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై ఇప్పటికీ అనుమానాలున్నాయని.. వాటిపై పోరాడుతున్నామని.. ఇప్పుడు కొత్త ఎత్తిపోతలు కూడా అనుమానాస్పదంగా ఉందని హరీష్ రావు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఇదో పెద్ద కుట్ర అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.