Begin typing your search above and press return to search.
రేవంత్ కు షాకుల సీక్వెల్ లో ఇది రెండవది
By: Tupaki Desk | 8 Nov 2017 4:55 PM GMTతెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పి...కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా తన సత్తా చాటుకోవాలని భావించిన రేవంత్ రెడ్డికి కాలం కలిసి రానట్లుగా కనిపిస్తోంది. సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోనే ఆయన్ను దెబ్బ తీసేందుకు అధికార టీఆర్ ఎస్ పార్టీ క్రియాశీలంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా దఫా దఫాలుగా చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ సీక్వెల్ చేరికల్లో భాగంగా తాజాగా మరికొందరు నేతలకు మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు - మహేందర్ రెడ్డి - జూపల్లి - లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
తాజా చేరికలతో కొడంగల్ పరిధిలోని కోస్ - దౌలతాబాద్ - బొమ్మరాసపేట ల కాంగ్రెస్ - టీడీపీల మైనారిటీ విభాగాలు, గిరిజన విభాగాలు ఖాళీ అయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా టీఆర్ ఎస్ పని చేస్తున్నదన్నారు. తెలంగాణ కోసం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినమన్నారు. సీఎం కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు కోదండరాంకు మంచోళ్లు అయ్యారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేద్దామంటే కోర్టుకు వెళ్లి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నరన్నారు. కాంగ్రెస్ - టీడీపీ కలిసి పాలమూరును వలసల జిల్లాగా మార్చాయని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గత పాలకులు కల్వకుర్తి - నెట్టెంపాడు - బీమా - కోయిల్ సాగర్ కింద 20 వేల ఎకరాలకే నీళ్లు ఇస్తే.. తాము మూడున్నరేండ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని - 500 చెరువులను నింపారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తామన్నారు.కొడంగల్ లో టీఆర్ ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీ ఇంటికి నల్లాతో స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తమన్నారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని మంత్రి ఉద్ఘాటించారు. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలోకి రావన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులది కుర్చీల కొట్లాట అని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా, టీఆర్ ఎస్ పార్టీలో చేరికల గురించి గతంలోనే రేవంత్ టేకిట్ ఈజీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి పార్టీ కండువా కప్పుకొన్న వారికే తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని...కూలీ డబ్బులు ఇచ్చి చేస్తున్న ఈ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారిందని ఎద్దేవా చేశారు.