Begin typing your search above and press return to search.

హరీష్ రావ్ నా? మజాకా? దెబ్బకు తిరిగొచ్చారు!

By:  Tupaki Desk   |   14 July 2021 10:00 PM IST
హరీష్ రావ్ నా? మజాకా? దెబ్బకు తిరిగొచ్చారు!
X
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య పార్టీ ఫిరాయింపులు జోరుగా నడుస్తున్నాయి. ఇరుపార్టీలు ఒకరి పార్టీలోని నేతలను మరొకరు లాగడమే పనిగా పెట్టుకున్నారు.తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల సొంత జిల్లా మెదక్ లో బీజేపీ టీఆర్ఎస్ కు షాకిచ్చింది. ఇద్దరు టీఆర్ఎస్ కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకుంది.

మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీలో ఫిరాయింపులను బీజేపీ చేసింది. ఇద్దరు టీఆర్ఎస్ కౌన్సిలర్లను లాగేసింది.వార్డు నెంబర్ 7కు చెందిన దివిటి కనుకయ్య, వార్డు నెంబర్ 8కు చెందిన డి. బాలక్రిష్ణలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

సీఎం కేసీఆర్, హరీష్ రావుల సొంత జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరడం అవమానంగా మారింది. ఇది టీఆర్ఎస్ కు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. దీంతో ఈ కౌన్సిలర్లను తిరిగి టీఆర్ఎస్ లోకి తీసుకురావడానికి హరీష్ రావు వెంటనే చర్యలు తీసుకున్నాడు. 24 గంటల్లోనే హరీష్ రావు వారిని తిరిగి టీఆర్ఎస్ లోకి తీసుకురాగలిగాడు.

బీజేపీలో చేరిన ఇద్దరు టీఆర్ఎస్ కౌన్సిలర్లను తిరిగి బుధవారం హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. టీఆర్ఎస్ ను విడిచిపెట్టినందుకు వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.

నిధులు విడుదల చేస్తామని.. వార్డులను అభివృద్ధి చేస్తామని బీజేపీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని.. తమను ఆకర్షించారని.. తప్పుదారి పట్టించారని ఆ కౌన్సిలర్లు ఆరోపించారు. తాము ఎప్పుడూ కేసీఆర్, టీఆర్ఎస్ లకు విధేయత చూపిస్తామని చెప్పుకొచ్చారు.