Begin typing your search above and press return to search.
పజ్జన్న మురిసిపోయేలా చేసిన హరీశ్!
By: Tupaki Desk | 25 Feb 2019 11:30 AM GMTఅనుకున్నట్లే జరిగింది. అంచనాలు ఏ మాత్రం తేడా రాకుండా తెలంగాణ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి.. సీనియర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావు అలియాస్ పజ్జన్న ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సభలో తిరుగులేని అధిక్యత ఉండటం.. ప్రధాన ప్రతిపక్షానికి ఏ మాత్రం బలం లేని నేపథ్యంలో పద్మారావు ఎంపికకు ఎదురే లేకుండా పోయింది.
పద్మారావు ఏకగ్రీవ ఎంపిక ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత ఆయన్ను అభినందిస్తూ మాజీ మంత్రి హరీశ్ చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. పద్మారావును పజ్జన్నగా పిలుస్తూ ఆయన్ను పొగడ్తల్లో ముంచేసిన వైనం అందరిని ఆకట్టుకునేలా సాగింది. హరీశ్ ప్రసంగం సాగినంతసేపు పద్మారావు ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. పార్టీ సీనియర్ సభ్యుడిగా.. ఉద్యమ వేళలో కేసీఆర్ తో కలిసి నడిచిన పద్మారావుకు తాజా మంత్రివర్గంలో స్థానం లభించకపోవటం ఆయన్ను కొంత నిరాశకు గురి చేసినట్లుగా చెబుతారు.
ఆ బాధను తగ్గిస్తూ ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉద్దేశించి హరీశ్ రావు చేసిన ప్రసంగం పద్మారావుకు విపరీతమైన ఆనందాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు. ఇక.. హరీశ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
+ గత 20 సంవత్సరాలు ఉద్యమ సహచరుడిగా - శాసన సభ్యుడిగా - సహచర మంత్రిగా మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. మీరు ఏ హోదాలో ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా అందరిచేత పజ్జన్నగా ముద్దుగా పిలుచుకునే పేరు మీకు దక్కింది.
+ చిన్నా, పెద్ద, కులం, మతం అనే ఏ బేదాభిప్రాయాలు లేకుండా ఉండే వ్యక్తి మీరు. నియోజకవర్గ కార్యకర్తలు మొదలుకుని నేతలు - మంత్రుల వరకు మిమ్మల్ని పజ్జన్న అని ముద్దుగా పిలుచుకుంటారు.
+ మీరు ఎప్పుడూ చిరునవ్వుతో గత 20 ఏళ్లుగా పని చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ‘జై తెలంగాణ నినాదం’ ఇచ్చినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా సభ మొత్తం వినబడేది. ఎంతో ఉద్యమ స్పూర్తిని చాటేవారు.
+ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మా నియోజకవర్గానికి వచ్చిన వేళలోనూ అక్కడి గీత కార్మికులకు హామీ ఇచ్చారు.
+ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరించడంతో పాటు.. చెట్లరకాన్ని రద్దు చేసిన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే అదృష్టం మీకు దక్కింది.
+ అదే రీతిలో గీత కార్మికులకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని పూర్తిగా నిషేధించడం మీ హయాంలో జరగడం నిజంగా చాలా గొప్ప నిర్ణయం.
+ తాటి.. ఈత చెట్లపై పన్ను రద్దు చేయడం వల్ల కల్లుగీత కార్మికులకు ఎంతో మేలు చేశారు.
+ క్రీడా శాఖమంత్రిగా ఉన్న సమయంలో సానియామీర్జా - సైనా నెహ్వాల్ - పీవీ సింధు గొప్ప అవార్డులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ ఔన్నత్యాన్ని - గౌరవాన్ని కూడా.. మీ హయాంలోనే రావడం నిజంగా మరిచిపోలేము.
+ డిప్యూటీ స్పీకర్ గా కూడా మీరు తప్పకుండా సభ ఔన్నత్యం - హుందాతనం పెరిగేలా విజయవంతం అవుతారన్న సంపూర్ణ విశ్వాసం ఉంది.
+ పద్మం బురదలో కూడా వికసిస్తోంది. మీరు పద్మారావుగా కార్పొరేటర్ - ఎమ్మెల్యేగా - ఎక్సైజ్ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ గా మంచి పేరు తెచ్చుకుంటారని.. ఒక పద్మంలాగా వికసిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది.