Begin typing your search above and press return to search.
పాతేయటం.. పూడ్చి పెట్టటం మాటలేంది హరీశా?
By: Tupaki Desk | 23 Nov 2016 7:40 AM GMTమర్యాద.. గౌరవం లాంటి వాటిని రాజకీయ నేతలు వదిలేసి చాలా కాలమే అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులపై నిర్మాణాత్మకంగా విమర్శలు చేయటం.. వారు చేసే తప్పుల్ని ఎత్తి చూపటం.. వారి వైఖరి బాగోలేదని.. పద్దతి మార్చుకోవాలన్న మాటలన్నీ ఇప్పుడు పోయాయి. దూకుడు రాజకీయాలతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఎంత ఆవేశంగా మాట్లాడితే అంత గొప్ప అన్నట్లుగా మారిపోయింది. చోటా నేతలు ఇలాంటివి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ముఖం మరింత బాగా కనిపిస్తుందన్న ఆశతో వారు అలాంటి పనులు చేస్తారని అనుకోవచ్చు.
కానీ.. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావులాంటి వారు సైతం నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. తాము అధికారపక్షమన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా వ్యవహరించటం విస్తుపోయేలా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా ఇంతేసి మాటలు హరీశ్ రావు నోటి నుంచి రాలేదని చెప్పాలి. ప్రభుత్వ విధానాల్ని.. వారు చేపట్టే కార్యక్రమాల్ని అడ్డుకోవటం విపక్షాల ప్రాధమిక కర్తవ్యం. కానీ.. అలాంటి వాటిని తాము సహించే పరిస్థితుల్లో లేమన్నట్లుగా హరీశ్ రావు మాటలు ఉండటం ఇప్పుడు చర్చగా మారింది.
మల్లన్నసాగర్ తో పాటు.. పలు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ విపక్షాలు విమర్శలతో దాడుల తీవ్రతను పెంచిన వేళ.. ఆ ప్రభావం తమపై ఉందన్న విషయాన్ని హరీశ్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం.. కోర్టులో కేసులు వేయటమే కాదు.. కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ హరీశ్.. ‘‘కాల్వలను ఆపితే ప్రతిపక్షాలను అందులోనే పూడ్చేస్తాం’’ అని హెచ్చరించటం సంచలనంగా మారింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కోర్టుల్లో కేసులు వేయటం లాంటివి మానుకోవాలని చెప్పటం ఓపెన్ వార్నింగ్ కిందకు వస్తుందని.. హరీశ్ లాంటి నేత నోటి నుంచి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత దూకుడుగా మాట్లాడితే మైలేజ్ తర్వాత.. లేనిపోని వివాదంగా మారుతుందన్న విషయాన్ని హరీశ్ ఎందుకు మరచిపోతున్నారన్నది పాయింట్ గా మారింది. హరీశ్ లో ఎందుకింత అసహనం..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/