Begin typing your search above and press return to search.
కాస్త ట్వీట్ చేసేటప్పుడు ఆలోచించవయ్యా హరీశ్.. మామను తిట్టిస్తావా?
By: Tupaki Desk | 5 Oct 2022 1:30 AM GMTగతంలో మీడియా మాత్రమే ఉన్నప్పుడు నేతల నోటి నుంచి ఏదైనా మాట తప్పుగా వస్తే.. దాన్ని తూచ్ అనేందుకు అవకాశం ఉండేది. సోషల్ మీడియా.. యూట్యూబ్ కాలంలో అది ఏ మాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఒకసారి మాట వచ్చిందంటే.. అదిక రికార్డ్ మాదిరి మారిపోయే పరిస్థితి. ఇలాంటి వేళలో.. అనుక్షణం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయటానికి కారణంగా జయశంకర్ భూపాల పల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సతీమణి.. ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసవం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరగటమే. సోమవారం పురిటి నొప్పులు రావటంతో ఆమెను భూపాలపల్లి జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి ఆడ్మిట్ చేశారు.
సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించారు కానీ.. శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో.. సిజేరియన్ చేయక తప్పలేదు. దీంతో.. గైనకాలజిస్టులు శ్రీదేవి.. లావణ్య.. సంధ్యారాణి.. విద్యలు కలిసి ఆమెకు ఆపరేషన్ చేశారు. మగ శిశువుకు జన్మనిచ్చిన ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టిన బాబు 3.4 కేజీలుగా వైద్యులు చెబుతున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఏరియా ఆసుపత్రిలో డెలివరీ చేయించుకొని ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
ఇలాంటి వేళ.. ఆ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు రియాక్టు అయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా మెరుగుపడ్డాయని.. అందరికి మొదటి ఎంపిక అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఇదే ఇప్పుడు అభ్యంతరకరంగా మారాయి. తన మంత్రిత్వ శాఖను తానే పొగుడుకోవటం బాగానే ఉన్నా.. ఆయన పొగుడుకున్న తీరు బాగోలేదంటున్నారు. కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా హైదరాబాద్ లోని భారీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి.
ప్రతి సందర్భంలోనూ వారు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి వెళుతున్నవైనం అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక ప్రభుత్వ ఆసుపత్రులే అంటూ హరీశ్ రావు చేసిన ట్వీట్.. సీఎం కేసీఆర్ కు ఆయన కుటుంబానికి నెగిటివ్ గా మారటం ఖాయమంటున్నారు. అందుకే.. మేనమామను తిట్టించాలనే హరీశ్ రావు ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కలెక్టర్ గా ఉండి కూడా.. ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల సేవల్ని వాడుకోకుండా సర్కారీ వైద్యం చేయించుకున్న వారిని నిండు మనసుతో అందరూ అభినందించాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.