Begin typing your search above and press return to search.

హ‌రీశ్ షెడ్యూల్ అంటే అలానే ఉంటుంది మ‌రి!

By:  Tupaki Desk   |   12 Jan 2018 4:42 AM GMT
హ‌రీశ్ షెడ్యూల్ అంటే అలానే ఉంటుంది మ‌రి!
X
తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అంతా ఇంతా కాదు. స‌మ‌ర్థుడైన ముఖ్య‌మంత్రితో పాటు.. ఆయ‌న ఉత్సాహానికి త‌గ్గ‌ట్లే ప‌ని చేసే వారు ఉండ‌టం అధృష్టం కాక మ‌రేంటి? కేసీఆర్ వ్యూహ చ‌తుర‌త‌.. స‌మ‌రోత్సాహం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించేవారు.. ఆచ‌రించే వారు ఎక్కువ మంది ఉన్నార‌ని చెప్పాలి.

అధినేత‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్య‌వ‌హ‌రించే నేత‌లు ఒక‌రికంటే ఎక్కువ‌మంది ఉండ‌టం అంత చిన్న విష‌యం కాదు. ఏపీ విష‌యానికే వ‌స్తే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి ఉత్సాహంగా తిరిగే నాయ‌కుడే ఆ పార్టీలో క‌నిపించ‌రు.

ఆ మాట‌కు వ‌స్తే.. ఏపీలో హ‌డావుడి అంతా బాబు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కానీ.. తెలంగాణ‌లో అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌దు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తోప ఆటు.. మంత్రులు కేటీఆర్‌.. హ‌రీశ్ ల‌తో పాటు.. ఆయ‌న కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత.. ఇలా చెప్పుకుంటూ లిస్ట్ కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.

కేసీఆర్ క‌ష్టానికి డ‌బుల్ క‌ష్టం చేయ‌టంలో మంత్రి హ‌రీశ్ ఎప్పుడూ వెనుకాడ‌రు. అంద‌రూ పండ‌గ‌ల వేళ హ్యాపీగా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విందుల‌తో మునిగి ఉంటే.. హ‌రీశ్ మాత్రం అందుకు భిన్నంగా ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతూ.. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంటారు.

2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి సాగునీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌టంతో పాటు.. మిష‌న్ భ‌గీర‌థ‌ను కంప్లీట్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు హ‌రీశ్‌. తాజాగా ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఆయ‌న టూర్ షెడ్యూల్ ఎంత టైట్ గా ఉందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఉద‌యం మొద‌లు రాత్రి వ‌ర‌కూ అవిశ్రాంతంగా ప‌ర్య‌టిస్తూ.. అభివృద్ధి ప‌నుల్ని స‌మీక్షిస్తున్న వైనం చూస్తే.. హ‌రీశ్ ఎంత హార్డ్ వ‌ర్క‌రో ఇట్టే తెలుస్తుంది.

గురువారం జ‌య‌శంక‌ర్ భూపాల ప‌ల్లి జిల్లాలో హ‌రీశ్ జ‌రిపిన సుడిగాలి ప‌ర్య‌టన లెక్క‌లు వింటే.. ఒక్క‌రోజులో ఇన్ని ప‌నులు పూర్తి చేయ‌టం సాధ్య‌మా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఉద‌యం ప‌ది గంట‌ల స‌మ‌యంలో రేగొండ‌లోని దేవాదుల పైపులైన్ స‌మీపానికి హెలికాఫ్ట‌ర్ ద్వారా చేరుకున్న ఆయ‌న డీబీఎం 38 కాలువ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌.. చెంచుకాల‌నీలో గోదాంల ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

ఆ త‌ర్వాత రేగొండ స‌భ‌లో ప్ర‌సంగించిన ఆయ‌న గ‌ణ‌ప స‌ముద్రం మ‌త్తిడి కింద హైలెవ‌ల్ వంతెన‌ను.. గోదాంను స్టార్ట్ చేశారు. మ‌ధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాల‌యంలో భోజ‌నం చేసి అధికారుల‌తో మాట్లాడిన హ‌రీశ్‌.. త‌ర్వాత గొల్ల‌బుద్దారంలోని భీంఘ‌న్ పురం రిజ‌ర్వాయ‌ర్ నుంచి రామ‌ప్ప వ‌ర‌కు పైపులైన్ ప‌నుల్ని ఆరా తీసి.. అధికారుల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

అక్క‌డ నుంచి బ‌య‌లుదేరిన హ‌రీశ్‌.. త‌న తిరుగు ప్ర‌యాణంలో రాంపూర్ వ‌ద్ద మెగా కంపెనీకి చెందిన పైపుల త‌యారీ కేంద్రాన్ని ప‌రిశీలించారు. వెంక‌టాపురం మండ‌లం బూర్గుపేట శివారు రామ‌కిష్టాపూర్ గ్రామ స‌మీపంలో దేవాదుల మూడో విడ‌త పైప్ లైన్ ప‌నుల్ని ప‌రిశీలించారు. అక్క‌డ నుంచి నేరుగా ములుగు మండ‌లం బండారుప‌ల్లి వ‌ద్ద దేవాదుల మూడో విడ‌త ట‌న్నెల్ ప‌నులు ప‌రిశీలించారు. ఇలా.. క్ష‌ణం తీరిక లేకుండా ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ అదే ప‌నిగా తిరుగుతూ.. ప‌నుల్ని ప‌రుగులు పెట్టించిన వైనం చూస్తే.. హ‌రీశ్‌ను ప‌నిరాక్ష‌సుడు అని అనుకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.