Begin typing your search above and press return to search.

కులభూషణ్ ను ఇండియాకు తెస్తానంటున్నాడు

By:  Tupaki Desk   |   19 May 2017 7:44 AM GMT
కులభూషణ్ ను ఇండియాకు తెస్తానంటున్నాడు
X
పాకిస్థాన్ లో మరణ శిక్ష పడిన మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో అనకూల తీర్పు పొందినా జాదవ్ విషయంలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానానికి తీర్పులు చెప్పడం వరకే కానీ, దాన్ని అమలు చేయించే అధికారం లేకపోవడంతో పాక్ ఒక వేళ అడ్డం తిరిగితే ఎలా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. భారత్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించి అనుకూల ఫలితం రాబట్టిన హరీశ్ సాల్వే దీనికి సమాధానం చెప్తున్నారు. పాక్ అడ్డం తిరిగితే ఏం చేయాలనేది కూడా తమకు తెలుసంటున్నారు.

జాదవ్ ను ఎలాగైనా భారత్ చేర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ కేసులో ఇండియా తరఫున వాదనలను సమర్థవంతంా వినిపించిన సాల్వే, 46 ఏళ్ల జాదవ్ ను విడిపించే విషయంలో తమ వద్ద రెండు ప్లాన్ లు ఉన్నాయని అంటున్నారు. తొలుత ప్లాన్ ఏను అమలు చేస్తామని, అది విఫలమైతే ప్లాన్ బీ అమలు చేస్తామని తెలిపారు. ప్లాన్ ఏ లో భాగంగా, న్యాయమీమాంశను తెరపైకి తెచ్చి, తక్షణం జాదవ్ ను విడుదల చేయాలని పాకిస్థాన్ కు విజ్ఞప్తి చేస్తామని ఆయన అన్నారు.

ఒకవేళ, ఈ మార్గంలో జాదవ్ విడుదల కుదరకుంటే, రెండో ప్రణాళిక అమలు చేస్తామని, అది దీర్ఘకాలం పాటు సాగుతుందని, పాకిస్థాన్ కోర్టుల్లోనే విషయాన్ని తేల్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. జాదవ్ నిర్దోషిత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించే వీలుండదని స్పష్టం చేసిన ఆయన, దాన్ని పాకిస్థాన్ కోర్టుల్లోనే నిరూపించాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న పరిమితుల దృష్ట్యా, జాదవ్ ను ఇండియాకు అప్పగించాలన్న తీర్పు వచ్చే అవకాశాలుండవని తెలిపారు. జాదవ్ ను ఎలాగైనా ఇండియాకు తేవడమే తన లక్ష్యమని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/