Begin typing your search above and press return to search.

కుల‌భూష‌ణ్ కేసుకు ఆ లాయ‌ర్ ఫీజు ఎంతంటే?

By:  Tupaki Desk   |   16 May 2017 6:34 AM GMT
కుల‌భూష‌ణ్ కేసుకు ఆ లాయ‌ర్ ఫీజు ఎంతంటే?
X
మాజీ నేవీ అధికారి కుల‌భూష‌ణ్ జాద‌వ్ ను అక్ర‌మంగా అరెస్ట్ చేసి.. అనైతిక ప‌ద్ద‌తుల్లో ఉరిశిక్ష విధించిన పాకిస్థాన్ దుర్మార్గంపై అంత‌ర్జాతీయ కోర్టులో భార‌త్ స‌వాలు చేయ‌టం తెలిసిందే. పాకిస్థాన్ తో ఒక వివాదానికి సంబంధించి అంత‌ర్జాతీయ కోర్టును ఆశ్ర‌యించి ద‌శాబ్దాన్న‌ర కంటే ఎక్కువే అయ్యింది. కుల్ భూష‌ణ్ ఉరిపై తీవ్ర ఆందోళ‌న చేస్తున్న భార‌త్‌.. ఆ విష‌యాన్ని అంత‌ర్జాతీయ కోర్టులో త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి భార‌త్ త‌ర‌ఫున భార‌త మాజీ సాలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హ‌రీశ్ సాల్వే వాదిస్తున్నారు.

అత్యున్న‌త న్యాయ‌స్థానంలో జాద‌వ్ కేసును వాదిస్తున్న సాల్వేకు ఫీజు రూపంలో భార‌త్ స‌ర్కారు ఎంత ఇస్తుంద‌న్న సందేహం ప‌లువురికి క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. దీనికి స‌మాచారం తెలిస్తే మాత్రం అవాక్కు అవ్వాల్సిందే. నిజానికి సాల్వే తీసుకుంటున్న ఫీజుకు సంబంధించిన ముచ్చ‌ట అనూహ్యంగా తెర మీద‌కు వ‌చ్చింది.

కుల‌భూష‌ణ్ జాద‌వ్ కేసును వాదించేందుకు హ‌రీశ్ తీసుకున్న ఫీజు కంటే త‌క్కువ‌కే భార‌త్ కు మ‌రో మంచి లాయ‌ర్ దొర‌క‌రేమో అంటూ సంజీవ్ గోయ‌ల్ అనే వ్య‌క్తి ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి సుష్మా స్వ‌రాజ్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇలా వ్యాఖ్య‌లు చేయ‌టం స‌రికాద‌ని.. ఈ కేసుకు సంబంధించి సాల్వే తీసుకుంటున్న ఫీజు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మేన‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించారు. జాద‌వ్ కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై అంత‌ర్జాతీయ కోర్టు త్వ‌ర‌గా స్పందించాల‌ని.. లేనిప‌క్షంలో పాక్ ఉరిశిక్ష‌ను అమ‌లు చేసే ప్ర‌మాదం ఉంద‌న్న ఆందోళ‌న‌ను భార‌త్ త‌ర‌ఫున సాల్వే వ్య‌క్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయ‌న యాభై నిమిషాల పాటు వాదించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/