Begin typing your search above and press return to search.
గెలిచే దగ్గర కేటీఆర్.. ఓడే దగ్గర హరీషా?
By: Tupaki Desk | 16 Aug 2021 12:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో చిత్రమైన పరిస్తితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. సొంత నేతల విషయంలో పార్టీ ఇలా చేస్తోందేం టి? అనే సందేహాలు వస్తున్నాయి. అంటే.. ఎలాంటి ఇబ్బందీ లేని చోట.. ఎలాంటి అడ్డంకులు లేకుండా గెలుస్తామని భావించిన చోట.. సీఎం కేసీఆర్ తన తనయుడికి ఏరికోరి బాధ్యతలు అప్పగిస్తున్నారని.. అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఉప ఎన్నికనే తీసుకుంటే.. ఇక్కడ సీఎం కేసీఆర్ తనయుడు బాధ్యత తీసుకున్నారు.
వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ అంటేనే.. టీఆర్ ఎస్‌కు ఒకరకంగా.. కంచుకోట. ఎలా అంటే.. పారిశ్రామిక వేత్తలు.. సెటిలర్లు.. సినీ ప్రముఖులు.. అభిమానులు ఉన్నది ఇక్కడే. సో.. వీరంతా కూడా అధికార పార్టీకి అండగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా.. కేసీఆర్ కనుసన్నల్లో నే ఆయా వర్గాలు మసులు తున్నాయి. దీనిని బట్టి.. ఇక్కడ టీఆర్ ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అనడంలో సందేహం లేదు. అయితే.. ఇలాంటి చోట మాత్రం.. ఎన్నికల బాధ్యతను.. తన కుమారుడు, మంత్రి కేటీఆర్ చేతిలో పెడుతున్నారని.. కేసీఆర్‌పై ఒక చర్చ సాగుతోంది.
అదేసమయంలో పార్టీకి పెద్దగా పట్టుందో లేదో.. తెలియని పరిస్థితి నెలకొన్న చోట.. గెలుపుపై పెద్దగా ఆశలు లేవని.. విశ్లేషణలు వచ్చిన చోట మాత్రం సదరు బాధ్యతలను మేనల్లుడు, ప్రస్తుత ఆర్థిక మంత్రి.. హరీష్‌రావుకు కేసీఆర్ అప్పగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా.. దుబ్బాక ఉప ఎన్నికలను చూపిస్తున్నారు. ఇక్కడ పార్టీ గెలుపును హరీష్‌రావుపై మోపారు. దీంతో ఆయన ఇక్కడ పార్టీ విజయం దక్కించుకుంటుందని అనుకున్నారు.కానీ, అనూహ్యంగాబీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంతేకాదు.. బీజేపీ పుంజుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇది జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మరింత ప్రభావం చూపించేలా మారింది. ఈ పరిణామాలు చూస్తే.. టీఆర్ ఎస్ గెలిచే చోట.. కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నారని.. అదే.. సమయంలో.. పార్టీకి ఒకింత ఇబ్బంది పరిస్థితి ఉంటే మాత్రం హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల.. కేటీఆర్‌కు హరీష్‌కు మధ్య ప్రజల్లో ఒకవిధమైన చర్చ నడుస్తోందని అంటున్నారు. ప్రస్తుత విషయానికి వస్తే.. కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికను కూడా హరీష్ రావే భుజాన వేసుకున్నారు. అయితే.. ఇక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెంటిమెంటును తట్టుకుని, టీఆర్ ఎస్‌ను గెలిపించే బాధ్యతను.. హరీష్‌రావుకు అప్పగించారు. కానీ, ఇది సాధ్యమేనా? అత్యంత టఫ్‌గా సాగుతున్న ఉప పోరులో టీఆర్ ఎస్ గెలిచి.. హరీష్ రావు... సత్తా చాటేనా? అనేది ఇప్పుడు.. ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.