Begin typing your search above and press return to search.
పాల డెలివరీకి హార్లే డేవిడ్ సన్ బైక్.. ఎక్కడంటే?
By: Tupaki Desk | 7 Jan 2023 4:43 AM GMTనిద్ర లేచినంతనే డోర్ దగ్గరకు వెళ్లి చూస్తే.. పాల పాకెట్ కనిపిస్తూ ఉంటుంది. గతంలో పాలు తెచ్చే వ్యక్తి ఉండటం.. పొద్దున్నే తలుపు కొట్టటం.. నిద్ర కళ్లతో తలుపు తీసి పాలు పోయించుకొని వేడి చేసుకోవటం లాంటి ప్రక్రియ ఉండేది.
ఇప్పటికి ఇలాంటి పద్దతి కొన్ని గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో ఉన్నా.. చాలావరకు పాలను పాకెట్లలో కొనుగోలు చేసే పద్దతి అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. పాలను డెలివరీ చేయటం కోసం ఖరీదైన బైక్ ను వినియోగిస్తున్న వైనం ఒకటి నెటిజన్ కంట్లో పడటం.. ఆ వెంటనే ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.
పాలు అమ్మేందుకు దాదాపు రూ.11 లక్షలు విలువైన ఖరీదైన బైక్ ను వినియోగించటం ఆసక్తికరంగా మారింది. ఈ బైక్ వెనుక.. గుజ్జర్ అని రాసి ఉండటం చూస్తే.. ఈ బైక్ కొనుగోలుదారు నిబంధనల విషయాన్ని అంత పెద్ద పట్టించుకునేట్లుగా కనిపించట్లేదనే చెప్పాలి.
గుజరాత్ కు చెందినట్లుగా భావిస్తున్న ఈ బైక్ యజమాని.. తన హార్లే డేవిడ్ సన్ బైక్ మీద భారీ పాల క్యాన్ ను ఏర్పాటు చేసుకొని.. దాన్ని తీసుకొని రోడ్డు మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.
దీనికి సంబంధించిన వీడియోను అమిత్ బదనా అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయటం.. అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. పాల డెలివరీ కోసం ఇంత ఖరీదైన ఖైక్ ను వినియోగించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా పాల డెలివరీకి పాత స్కూటర్ లేదంటే మోపెడ్ ను వాడటం అలవాటైనా.. ఇంత ఖరీదైన బైక్ ను వాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాలుగు పైసలు ఉండి.. కాస్తంత టేస్టు ఉంటే.. ఇలాంటివెన్నో చేసే వీలుంది. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటివి వైరల్ గా మారటంతో.. మరిన్ని ప్రయోగాలకు అవకాశంగా మారుతోందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.