Begin typing your search above and press return to search.

బైక్ ప్రియులకి బ్యాడ్ న్యూస్ .. హార్లే-డేవిడ్సన్ ప్లాంట్ మూత !

By:  Tupaki Desk   |   21 Aug 2020 12:30 AM GMT
బైక్ ప్రియులకి బ్యాడ్ న్యూస్ .. హార్లే-డేవిడ్సన్ ప్లాంట్ మూత !
X
హార్లే-డేవిడ్సన్‌ ..యువత డ్రీం బైక్. కుర్రకారు ఒక్కసారైనా ఈ హార్లే-డేవిడ్సన్‌ బైక్ ను డ్రైవ్ చేయాలని అనుకుంటారు. దేశంలో కరోనా విజృంభణ మూలంగా అమ్మకాలు భారీగా పడిపోవడంతో భారతదేశంలో కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితి .. భవిష్యత్తు డిమాండ్ పై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం అవుతుంది. ఈ క్రమంలో హర్యానాలోని బావాల్ వద్ద ఉన్న తన ప్లాంట్‌కు త్వరలో మూతవేయనున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఒప్పందం కోసం ఇప్పటికే కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. కాగా గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సమయంలోనే సంస్థ ఈ సంకేతాలు ఇచ్చింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి బైక్ ‌లతో దేశీయ కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించింది.

అలాగే , కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అటు దేశీయంగా ఇటు, అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. విక్రయాలు దాదాపు శూన్యం కావడంతో స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలోనే హార్లే డేవిడ్సన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.