Begin typing your search above and press return to search.
విశ్వ సుందరిగా భారత్ కు చెందిన హర్నాజ్ కౌర్.. ఎవరీ బ్యూటీ? ఎలా గెలిచింది?
By: Tupaki Desk | 13 Dec 2021 10:04 AM ISTభారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచవేదికపై సత్తాచాటింది. ఇజ్రాయెల్ లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు టైటిల్ ను గెలుచుకొని విశ్వ యవనికపై భారతదేశం ఖ్యాతిని ఇనుమడింపచేసింది. 21 ఏళ్లకే భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం సాధించిపెట్టింది.
ఈ పోటీల్లో దాదాపు 80 దేశాల నుంచి అందెగత్తెలు పాల్గొనగా.. వారందరినీ హర్నాజ్ ఓడించి అన్ని కేటగిరిల్లోనూ అధిగమించి యూనివర్స్ కిరీటం దక్కించుకోవడం విశేషం. ఈ పోటీలో తన ప్రదర్శనతో భారతీయులను గర్వపడేలా చేసింది హర్నాజ్ కౌర్ సంధు.
భారత్ కు చెందిన హర్నాజ్ మిస్ యూనివర్స్ గా గెలుపొందగా.. రన్నరప్ గా పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా.. దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్ గా నిలిచింది. 21 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ టైటిల్ దక్కడం విశేషం.చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరుఫున ఈ కిరీటం దక్కించుకుంది.
హర్నాజ్ 2000 మార్చి 3న చండీగఢ్ లో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో చదివింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ సాధించింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది.
హర్జాజ్ చిన్నప్పటి నుంచి ఫిట్ నెస్ లవర్. గుర్రపు స్వారీ.. ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ ను అమితంగా ఇష్టపడుతోంది. ఓవైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువుకుంది. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించింది. 2017లో టైమ్స్ ఫ్రెష్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ , 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ గా గెలిచింది. ఇప్పుడు మిస్ యూనివర్స్ గా గెలిచి భారత్ సత్తా చాటింది.
గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరిటాన్ని సుస్మితా సేన్ (1994), లారా దత్తా(2000)మాత్రమే సాధించారు. ఇది మూడో కిరీటం.