Begin typing your search above and press return to search.
హర్షా భోగ్లే ... నిజాన్ని చెప్పడానికి అంత భయం అక్కర్లేదు!
By: Tupaki Desk | 2 April 2020 2:30 AM GMTదేశంలో కరోనా కట్టడిలోకి వస్తుంది అని భావిస్తున్న తరుణంలో ఢిల్లీ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని వణికించేస్తుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సాముహిక ప్రార్ధనల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటీవ్ రావడంతో దేశం మొత్తం ఉలిక్కి పడుతుంది. తెలంగాణలో మరణించినవారు.. ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఈ నిజాముద్దీన్ ప్రార్ధనల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం.
దీనితో నిజాముద్దీన్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజాముద్దీన్ వాసులను ఢిల్లీలోని వేర్వేరు ఆస్పత్రులకు బస్సుల్లో తరలించి వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని వెతికిపట్టుకొని పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. దీనితో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని మరింత కఠినతరం చేసాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేసి ఇరుకున పడ్డాడు.
ఇంతకీ అయన చేసిన ట్విట్ ఏమిటి అంటే .."సమాజ శ్రేయస్సు కోసం రాబోయే కొన్ని వారాలు ఇంట్లోనే ఉందాం. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కలిసికట్టుగా అడ్డుకుంటే.. అది మనల్ని మరింత బలవంతులను చేస్తుంది. దయచేసి సామూహిక సమావేశాలకు దూరంగా ఉండండి. మనం మరో సమస్యను తట్టుకోలేం అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. అయితే తొలుత.. ఈ ట్వీట్‌లో మనం మరో నిజాముద్దీన్ ఘటనను భరించలేం అని ,ఆ తరువాత ఆ ట్వీట్ లో నిజాముద్దీన్ పదాన్ని తొలిగించాడు.
అలాగే ఆలా ఆ పదాన్ని తొలగించడానికి గల కారణం కూడా తెలిపాడు. నా ట్వీట్ ఒకరు వేలెత్తి చూపించేలా ఉందనిపించింది. అందుకే ఆ పదాన్ని తొలగించాను అని తెలిపాడు. నా ఉద్దేశం మరోసారి సాముహిక సమావేశాలు జరపవద్దని మాత్రమే. వాటిని ప్రజలు భరించలేరు అని తెలపడమేనని ఇంకో ట్వీట్ చేశాడు. దీంతో హర్షా భోగ్లే తీరుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. అంత పిరికివాడివైతే క్రికెట్ కామెంట్రీ ఎలా చెప్తున్నావని నిలదీస్తున్నారు.