Begin typing your search above and press return to search.
మాజీ ఎంపీగారు పార్టీ మారట్లేదట
By: Tupaki Desk | 18 July 2016 10:20 AM GMTమాజీ ఎంపీ - కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ మరోమారు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ దఫా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపైనే కాకుండా నరేంద్రమోడీ సర్కారును సైతం ఆయన ముగ్గులోకి దించారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల పాలన సాగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహాలను పరిరక్షించాలని - అట్రాసిటీ చట్టం పక్కాగా అమలు చేయాలని - దళితులపై దాడులు అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వల్పకాలంలోనే ఐదు ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని హర్షకుమార్ అన్నారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ విగ్రహాల పరిరక్షణ విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని హర్షకుమార్ అన్నారు. దళితుల డిమాండ్లను ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన హెచ్చరించారు. తనకు పదేళ్ల రాజకీయ చరిత్ర ఉందని, ఇతర పార్టీల్లో చేరే ఆలోచన లేదని హర్షకుమార్ అన్నారు. తన రాజకీయ జీవితంపై పలువురు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా దళిత జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు.