Begin typing your search above and press return to search.
ఆ సీఎంకు మహిళా కేంద్రమంత్రి ఓపెన్ వార్నింగ్
By: Tupaki Desk | 12 Jan 2017 9:11 AM GMTపంజాబ్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. గడిచిన నాలుగు రోజుల్లో పంజాబ్ అధికారపక్షంపై తరచూ దాడులు జరుగుతున్న తీరు ఇప్పుడు ఆ రాష్ట్రంలోఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేలా చేస్తున్నాయని చెప్పాలి.
బాదల్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని.. నిరసనకారుల నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాద్ కమ్ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగితే.. తాజాగా ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ పై సిక్కు యువకుడు ఒకరు చెప్పుతో దాడి చేయటంతో అక్కడి రాజకీయం గరంగరంగా మారింది.
తాజా పరిణామాణాలపై కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దాడుల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆమె ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. కేజ్రీవాల్ పార్టీ మీద హింసాత్మక దాడులకు దిగాలని అకాలీ శ్రేణులకుకానీ పిలుపునిస్తే.. పంజాబ్ లోని ఆప్ మద్దతుదారులు ఒక్కరుకూడా ప్రాణాలతో మిగలరంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు.
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్న ఆమె.. ఆప్ మీద తాము కానీ తిరగబడితే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందంటూ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/