Begin typing your search above and press return to search.
కరోనాతో వాసన, రుచి ఎందుకు తెలీదో కనిపెట్టేశారు
By: Tupaki Desk | 29 July 2020 2:30 AM GMTమహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చే్స్తోంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోస సమస్యలు....ఇలా అనేక లక్షణాలతో కరోనా ప్రజలను నానా తిప్పలు పెడుతోంది. కొద్ది రోజులుగా కరోనా సోకినవారిలో రుచి, వాసన తెలియకపోవడం అనే లక్షణం కూడా కనిపిస్తున్నాయి.కరోనా సోకితే ఎంతటి ఘాటు వాసన అయినా ముక్కు గుర్తించలేకపోతోందని రోగులు చెబుతున్నారు. ఇక, నాలుక అసలు రుచిని గుర్తించడం లేదని, ఏది తిన్నా చప్పగా ఉంటోందని రోగులు అంటున్నారు. అయితే, కరోనా సోకిన చాలామంది రుచి, వాసన ఎందుకు కోల్పోతున్నారో అన్న సంగతి ఇన్నాళ్లూ వైద్యులకు, శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు. ఈ నేపథ్యంలో తాజాగా, అందుకు గల కారణాలను హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణుల బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
న్యూరాన్‌లకు నేరుగా కరోనా వైరస్ సోకడం వల్లే కరోనా సోకిన వారు రుచి, వాసన భావాన్ని కోల్పోతున్నారని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూరాన్ లలోని సహాయక కణాల పనితీరును కరోనా వైరస్ ప్రభావితం చేయడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. వివిధ కారణాల వల్ల రుచి, వాసన భావాన్ని కోల్పోవడాన్ని అనోస్మియా అంటారని, కోవిడ్ -19 రోగులలో అనోస్మియాకు కారణం ఈ కణాలేనని తెలిపారు. కరోనా కారణంగా అనోస్మియా బారినపడ్డవారిలో చాలామంది రుచి, వాసన భావాలను తిరిగి పొందగలుగుతారని అంటున్నారు. ఇటలీలో వైరస్ నుంచి కోలుకున్న తర్వాత 49 శాతం మంది వాసన లేదా రుచిని పూర్తిగా తిరిగి పొందారని కనుగొన్నారు. వారాలు లేదా నెలల వ్యవధిలో దానంతటే అదే అనోస్మియా వెళ్లిపోయే అవకాశముందని వెల్లడించారు. ముక్కు లోపల ఉప్పు నీటి ద్రావణంతో శుభ్రం చేయడం వల్ల వాసన తిరిగి పొందే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.