Begin typing your search above and press return to search.
షాకింగ్ గా హర్యానా డీజీపీ మాటలు!
By: Tupaki Desk | 27 May 2016 11:28 AM GMTఎవరైనా మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే ఏం చేస్తారు? పోలీసుల్ని ఆశ్రయిస్తారు. న్యాయం చేయాలని కోరతారు. సహజంగా ఎవరైనా ఇదే పని చేస్తారు.. ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు ఇవే మాటలు చెబుతారు. నిజానికి ఇలాంటి మాటలే చెబితే.. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే ఉండేది కాదు. తాజాగా హర్యానా డీజీపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నేరస్థులను.. వేధింపులకు గురి చేసే వారిని సామాన్యులైనా చంపేయొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. హర్యానా రాష్ట్ర పోలీస్ బాస్ కేసీ సింగ్ మాట్లాడుతూ.. లైంగిక వేధింపులకు గురి చేసే వారు ఆడ అయినా మగ అయినా అలాంటి వారిని చంపే హక్కు సామాన్యులకు ఉంటుందని పేర్కొన్నారు.
ఇళ్లు తగలబెట్టటం లాంటి సమయాల్లో.. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణల సమయంలో తమను తాము కాపాడుకోవటానికి కోసం న్యాయపరంగా అవతల వ్యక్తని చంపే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవటమే కాదు.. తేడా వస్తే చంపేయాలంటూ పోలీస్ బాసే ఏకంగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.