Begin typing your search above and press return to search.
ఇది మన దేశ దురదృష్టం..కరోనా చికిత్స చేసే వైద్యుల ప్రాణాలకే దిక్కులేదు
By: Tupaki Desk | 2 April 2020 12:30 AM GMTకొన్ని దారుణమైన నిజాలు ఇవి. ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న వారికే...వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని కల్పిస్తున్న సందర్భాలివి. ఓ వైపు రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా... మరోవైపు ఇప్పటికే ధ్రువీకరించిన కరోనా పాజిటీవ్ కేసుల బాధితులకు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే, అలా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బాధితుల కోసం చికిత్స అందిస్తున్న ఆ వైద్యుల పరిస్థితి ప్రమాదంలో పడుతోంది. ఎందుకో తెలుసా? మెజార్టీ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల.
ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా...దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానా కావచ్చు...మెట్రో నగరమైన కోల్‌కతా కావచ్చు...అన్ని చోట్లా కరోనా బారిన పడకుండా ఉండాలంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా...అలాంటి అవకాశం లేని పరిస్థితి. దేశ రాజధానిని ఆనుకొని ఉన్న రాష్ట్రమైన హర్యానాలోని ఆస్పత్రిలో వైద్యులకు N95 మాస్క్‌లు లేవు. దీంతో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ...బైక్ నడిపేటపుడు ఉపయోగించే హెల్మట్ల తో రక్షణ పొందుతున్నారు. దీనిపై అక్కడి వైద్యుల్లో డాక్టర్ సందీప్ గార్గ్ మాట్లాడుతూ..తమకు N95 మాస్క్‌లు లేనందున హెల్మట్ పెట్టుకొని రక్షణ పొందుతున్నామని అన్నారు. ఇక కీలకమైన బెంగాల్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉంది. బెలిఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆస్పత్రిలో చినిగిన ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ ధరించి కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో ఈ దుస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యుల దుస్థితి ఇంత దారుణంగా ఉండటం బాధాకరమని పేర్కొంటున్నారు. దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ సందర్భం రుజువు చేస్తోందని పేర్కొంటున్నారు. మొత్తం జీడీపీలో 1.3% ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే...వైద్యరంగం ఇలాంటి మహమ్మారులను ఎలా ఎదుర్కుంటాయని ప్రశ్నిస్తున్నారు. సరైన రక్షణ కవచ దుస్తులు లేకుండా వైద్యుల తో చికిత్స చేయించడం వారిని, వారి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మహమ్మారి ప్రబలిన సమయంలో అయినా...మన పాలకులు పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తారేమో వేచి చూడాలి.