Begin typing your search above and press return to search.
జాట్ల ఆందోళనలో అంత ఆరాచకం జరిగిందా?
By: Tupaki Desk | 31 May 2016 7:38 AM GMTజాట్ల ఆందోళన సమయంలో చోటు చేసుకున్నట్లుగా వచ్చిన సామూహిక అత్యాచారాలకు సంబంధించి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. హర్యానాలో ఆ మధ్యన జాట్లు చేసిన ఆందోళన సందర్భంగా కొందరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలు అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. అయితే.. అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదంటూ అక్కడి ప్రభుత్వం కొట్టిపారేసినా.. తాజాగా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న ప్రకాశ్ కమిటీ నివేదిక అందుకు భిన్నంగా ఉండటం ఇప్పుడు చర్చగా మారింది.
ఫిబ్రవరి 22న జాట్ల ఆందోళన సందర్భంగా కొందరు మహిళలు నగ్నంగా తన దాబాకు వచ్చినట్లుగా ఒక దాబా యజమాని పేర్కొనటమే కాదు.. తాను వారికి అవసరమైన బట్టలు.. దుప్పట్లు ఇచ్చినట్లుగా ముగ్గురు సభ్యులతో కూడిన ప్రకాశ్ కమిటీ రికార్డు చేసింది.
అలాంటిదేమీ జరగలేదని పోలీసుల విచారణలో దాబా యజమాని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఒక కీలక అంశానికి సంబంధించి రెండు పక్షాల మధ్య నెలకొన్న వైరుధ్యం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇంతకీ సామూహిక అత్యాచార పర్వం నడిచిందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.