Begin typing your search above and press return to search.

సింగర్ స్వప్నా చౌదరి చుట్టూ రాజకీయం

By:  Tupaki Desk   |   25 March 2019 12:25 PM GMT
సింగర్ స్వప్నా చౌదరి చుట్టూ రాజకీయం
X
సప్పా చౌదరి.. ఇప్పుడీ గాయనీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది. గొడవలకు కారణమైంది.. పేరు మోసిన ఈ హర్యానా గాయనితో.. ఇప్పుడు ఇరు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఇంతకీ ఈమె చేసిన తప్పేంటి అంటే.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రావడమేనట..

2018 సంవత్సరంలో గూగుల్ లో అత్యధికులు వెతికిన గాయని సెలబ్రెటీగా సప్నా చౌదరి నిలిచారు. హిందీ బెల్ట్ , ఢిల్లీ, సోషల్ మీడియాల్లో ఇప్పుడు ఈమె పేరు మారుమోగుతోంది.. ఇంతకీ ఈమె చేసిన పని ఏంటంటే.. ‘సప్పా చౌదరి కాంగ్రెస్ లో చేరిందంటూ వెల్ కమ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ’ అని యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ శనివారం ఉదయం ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీతో సప్నా చౌదరి ఉన్న ఆమె ఫొటోను కూడా షేర్ చేశారు.

అయితే ఆదివారం పరిస్థితి మారింది. అసలు ఏపార్టీలోనూ తాను చేరలేదని.. ప్రియాంకతో తాను ఉన్న ఫొటో పాతదని సప్పా చౌదరి ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో షాక్ తిన్న కాంగ్రెస్ వాదులు ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు వచ్చి ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టారు. అది వైరల్ అయ్యింది.

అయితే దీనిపై యూపీ బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ స్పందించారు. స్వప్నా కాంగ్రెస్ లో చేరలేదని.. ఆమె సంతకాన్ని కాంగ్రెస్ ఫోర్జరీ చేసిందని.. ఆ ఫారం 2011-15 మధ్య కాలంలోనిదని వ్యాఖ్యానించారు.

ఇక ఈ వివాదం అంటుకోగానే యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ దారుణ వ్యాఖ్యలు చేశారు.. ‘రాహుల్ గాంధీ.. స్వప్పా చౌదరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇటలీలో రాహుల్ తల్లి సోనియా ఏం వృత్తి చేశారో ఇప్పుడు స్వప్పా చౌదరి కూడా అదే పనిచేస్తోంది.. మీ నాన్న సోనియాను పెళ్లి చేసుకున్నట్టే.. రాహుల్ ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఇలా సప్నా చౌదరి ప్రస్తుతం రెండు జాతీయ పార్టీల మధ్య గొడవకు కారణమైంది.