Begin typing your search above and press return to search.
అపర కుబేరుడి నం.1 స్థానానికి అర్ధాంగి చెక్!
By: Tupaki Desk | 10 Jan 2019 8:23 AM GMTఅపర కుబేరుడు - ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన చేశారు. పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తన సతీమణి మెకంజీ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. బెజోస్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విడాకుల కారణంగా అమెజాన్ షేర్ల పై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ప్రస్తుతం నంబర్ వన్ గా ఉన్న బెజోస్ విడాకుల కారణంగా కిందకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ ను దాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఈ వారంలోనే అమెజాన్ అరుదైన ఘనత సాధించింది. బెజోస్ సంపద 137 బిలియన్ డాలర్లు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల జాబితాలో ఆయన అగ్ర స్థానంలో ఉన్నారు. భార్యతో విడాకుల నేపథ్యంలో డబ్బు విషయంలో సెటిల్ మెంట్లు జరిగితే బెజోస్ సంపద తగ్గడం ఖాయం. ఫలితంగా ఆయన అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
బెజోస్ సతీమణి మెకంజీ తొలినాళ్లలో అమెజాన్ లో పనిచేశారు. ఆమె రచయిత్రి కూడా. రెండు పుస్తకాలు రాశారు. గత కొన్నేళ్లుగా మెకంజీ కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. బెజోస్ నిర్వహించే కొన్ని సామాజిక కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. బెజోస్ - మెకంజీ దంపతులకు నలుగురు సంతానం. పాతికేళ్ల పాటు తాము అన్యోన్యంగా జీవించామని, ఇప్పుడు పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని బెజోస్-మెకంజీ సంయుక్తంగా ట్వీట్ చేశారు. ఇక పై తాము స్నేహితులుగా కొనసాగుతామన్నారు.