Begin typing your search above and press return to search.
అక్కడ కాంగ్రెస్ – బీజేపీ కలిసినట్లే(నా)?
By: Tupaki Desk | 7 April 2019 7:10 AM GMTఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తూ.. కేంద్రంలో అధికార ప్రతిపక్షంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్.. ఒకే అభ్యర్థికి మద్దతు ఇస్తుండటం విశేషం. కాంగ్రెస్ పరోక్షగా మద్దతు ఇస్తుండగా.. బీజేపీ నేరుగానే మద్దతు ప్రకటించింది. ఫలితంగా అలనాటి తెలుగు నటి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ణాటకలోని మండ్య పార్లమెంటు సీటు యావత్ భారత్ దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన కన్నడ నటుడు అంబరీశ్ హఠాన్మరణంతో ఆయన సతీమణి సుమలత రాజకీయాల్లోకి వచ్చారు. ఈక్రమంలో కాంగ్రెస్ నుంచి టికెట్ కోరగా జేడీఎస్ తో మైత్రిలో భాగంగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ను బరిలో దింపారు. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సీఎం సిద్ధరామయ్య సహకారంలో ఎన్నికల బరిలో దిగిన సుమలతకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు ఉందని సీఎం కుమారస్వామి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. సుమలత పేరుకే స్వతంత్య్ర అభ్యర్థి అని విమర్శించారు. ఆమెకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఉందన్నారు.
కాంగ్రెస్›– బీజేపీ కలిసే వ్యూహం
మండ్య పార్లమెంటు నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన తన కుమారుడు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ – బీజేపీ చక్రవ్యూహం పన్నుతోందని ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. ఈమేరకు స్వతంత్య్ర అభ్యర్థి సుమలత అంబరీశ్ కు బీజేపీ మద్దతు ఇవ్వగా.. కాంగ్రెస్ కూడా పరోక్షంగా చేయూతను ఇస్తోందని ఆరోపించారు. మండ్య నుంచి సుమలత పేరుకు మాత్రమే స్వతంత్య్ర అభ్యర్థి అన్నారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ తో పాటు చిన్న పార్టీలు, రైతు సంఘాలు ఏకమై నిఖిల్‌ను ఓడించేందుకు పన్నాగం పన్నినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటిని తిప్పికొట్టి జేడీఎస్‌ను గెలిపించే శక్తి మండ్య ప్రజలకు ఉందనే తనకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అభ్యర్థి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నేతలు మైత్రి ధర్మం పాటించక పోవడం దారుణమని వాపోయారు. అయితే కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో ఓడిపోతే జేడీఎస్ కారణం కాదని సీఎం కుమారస్వామి చెప్పారు. జేడీఎస్‌కు చెందిన మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై మండ్య స్వతంత్య్ర అభ్యర్థి సుమలత స్పందించారు. ‘అవును, కాంగ్రెస్ కార్యకర్తలు నా వెంటే ఉన్నారు’ అని సమాధానం ఇచ్చారు.