Begin typing your search above and press return to search.

కారు క్యాబినెట్‌లో కమలనాథులు ..?

By:  Tupaki Desk   |   8 Dec 2018 7:19 AM GMT
కారు క్యాబినెట్‌లో కమలనాథులు ..?
X
తెలంగాణ లో ముందస్తు సమరం ముగిసింది. దీంతో తెలంగాణ లో కొత్త స్నేహాలకు తెర తీసినట్లు అయ్యింది. పోలింగ్ శాతాన్ని బట్టి హంగ్ ప్రభుత్వం ఏర్పాడే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ పాత్ర కీలకం కానుంది. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్ టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య లోపాయికారి స్నేహం ఉందని వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన మెజారిటీ వ‌స్తే ఓకే. ఒక వేళ హంగ్ వ‌స్తే ప్రజాకూటమిని అడ్డుకోవడంలో భాగంగా టిఆర్‌ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

తెలంగాణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కి 7 నుంచి 10 స్దానాలు వరకు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి కి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ కి బద్ద శత్రువైన మజ్లిస్ పార్టీ టి ఆర్‌ ఎస్ మంత్రి వర్గంలో చేరదు. దీంతో భారతీయ జనతా పార్టీ టిఆర్‌ఎస్ క్యాబినెట్‌లో భాగం పంచుకునే అవకాశం ఉందంటున్నారు. దీని వల్ల తెలంగాణలో తమ పార్టీ బలం పెంచుకోవచ్చునని కమలనాథుల ఆలోచన. మరో వైపు బీజేపీ కి బద్ద శత్రువైన తెలుగుదేశం పార్టీ ని- ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నిలువరించవచ్చని కమలనాథుల ఆలోచన. అలాగే తమకు వ్యతిరేకంగా జాతీయ స్దాయిలో కూటమి కట్టాలనుకుంటున్న చంద్రబాబును కూడా కట్టడి చేసినట్లు అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం లో భాగస్వామ్యమైతే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా లో తెలంగాణ కూడా చేరుతుందన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ ని బలపరచవచ్చునని భావిస్తున్నారు. ఇదే అదనుగా తెలంగాణలో చాపకింద నీరులా విస్తరించవచ్చునన్నది భారతీయ జనతా పార్టీ అగ్ర నేతల ఆలోచన. ఈ నెల 11వ తేదీన తెలంగాణ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ రోజు మధ్యాహ్నాని కి తెలంగాణ లో లెక్కలు తేలిపోతాయి. ఇక్కడ అధికారంలో భాగస్వామ్యులైతే, దక్షిణాది రాష్ట్రాల లో మరింత బలపడవచ్చునన్నది కమలనాథుల వ్యుహంగా చెబతున్నారు.