Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ రాజ‌కీయం విక‌టిస్తోందా?

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:02 AM GMT
బాబు ఢిల్లీ రాజ‌కీయం విక‌టిస్తోందా?
X
ఢిల్లీలో చ‌క్రం తిప్పుతా... ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఏకం చేస్తా అంటూ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు చేస్తున్న ప్ర‌క‌ట‌న ఆచ‌ర‌ణ‌లో వాస్త‌వ రూపం దాల్చ‌డం లేదా? బాబు ఢిల్లీ రాజ‌కీయంలో `డ‌బ్బా` కొట్టుకున్నంత సీన్ లేదా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా, డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్య‌క్ర‌మం కేంద్రంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకున్న‌ది ఒక‌టైతే... వాస్త‌వంగా జ‌రిగింది ఒక‌ట‌ని అంటున్నారు.

ఆదివారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు యూపీఏ చైర్‌ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డీఎంకే అధినేత కరుణానిధి, కేరళా ముఖ్యమంత్రి పి.విజయన్‌ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలతో పాటుగా ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ ను కూడా ఆహ్వానించారు. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం న‌లుగురు మాత్ర‌మే ముఖ్య నేత‌లు విచ్చేశారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే మూడు పార్టీలు అంటే డీఎంకే మిన‌హా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ నేత‌లు మాత్ర‌మే విచ్చేశారు.

వాస్త‌వం ఇలా ఉంటే, టీడీపీ నేత‌లు మాత్రం క‌రుణానిధి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ ను కూడా త‌మ రాజ‌కీయం కోసం వాడుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు. చెన్నై లో ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త వేదిక అని... దానికి చంద్ర‌బాబు నాయ‌క‌త్వం అని బ్ర‌హ్మండం బ‌ద్ద‌లు అయిపోతున్న రీతిలో... ఎప్ప‌ట్లాగే ప్ర‌చారం చేసింద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.