Begin typing your search above and press return to search.
బాబులో ఓటమి భయం.. అందుకే మాట మార్చాడా?
By: Tupaki Desk | 7 April 2019 7:08 AM GMTఇన్నాళ్లు సెంటిమెంట్ ను రగిల్చాడు.. కేసీఆర్ ను బూచీగా చూపాడు.. ప్రతిపక్ష నేత జగన్.. మోడీ-కేసీఆర్ లతో కలిశాడన్నాడు.. కానీ ఇప్పుడు సడన్ గా బాబు స్వరం మార్చాడు.. పూర్తిగా మారిపోయాడు.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం చేసి తెలుసుకున్న వాస్తవమో లేక అంతర్గత సర్వేల సారాంశమో కానీ చంద్రబాబు ఈసారి ఎమ్మెల్యేలను చూసి ఓటేయకండని.. తనను చూసి 175 నియోజకవర్గాల్లో గెలిపించడని కోరడం రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై కొన్ని చోట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వారిని ఓడించేందుకు జనం రెడీ అయ్యారట.. దీంతో ఎమ్మెల్యేలపై ఎలాంటి అసంతృప్తి ఉన్నా వదిలేయాలని.. పార్టీని, తనను నమ్మి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని బాబు కోరడం హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. వారు ఓడిపోతారని తెలిసినా టికెట్లు కేటాయించాడు. కేవలం 30 శాతం స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చేశాడు. నియోజకవర్గాల్లో అసంతృప్తి, అసమ్మతులను తెలుసుకొని మరీ ఆర్థికంగా బలంగా ఉన్న ఉన్న సిట్టింగ్ లకు వ్యతిరేకత ఉన్నా టికెట్లు ఇచ్చేశాడు.
కొద్దిరోజులుగా విస్తృతంగా ఏపీలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు అసలు విషయం అర్థమైనట్టు సమాచారం. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత టీడీపీ పుట్టి ముంచుకుండా ఉండేందుకు బాబు కొత్త పల్లవి అందుకున్నాడు.. ఎమ్మెల్యేల దందాలు, అవినీతి, ఎన్నికల వేళ టీడీపీకి నష్టం జరగకుండా ఉండేందుకు తనను చూసి ఓటేసి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లను గెలిపించాలని తాజాగా నిన్న రాత్రి ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.
తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా ఇలా తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా తనను చూసి ఓటేయాలని పిలుపునివ్వడం వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పోలింగ్ సమయానికి పోగొట్టడానికి కేసీఆర్ స్ట్రాటజీని ఫాలో అవుతూ పిలుపునివ్వడం విశేషం.