Begin typing your search above and press return to search.
బాబుకు వణుకుగా మారిన మోడీ టూర్!
By: Tupaki Desk | 27 Dec 2018 6:04 AM GMTతెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న వారిని అడ్డుకోండి.. వీరిని నిలదీయండి.. వారింటిని ముట్టడించండి.. ఇలాంటి మాటలు చాలానే విన్నాం. కానీ.. ఏ రోజు కూడా చంద్రబాబు నోటి నుంచి ఈ తరహా మాటల్ని విన్నది లేదు. కానీ.. బాబు సైతం ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే.. మోడీ ఫోబియా బాబును బెంబెలేత్తేలా చేస్తుంది. మోడీతో నాలుగేళ్ల పాటు దోస్తానా చేసిన బాబుకు.. ఏపీకి మోడీ ఏమీ చేయలేదన్న విషయం ఇప్పుడే అర్థమైనట్లుగా ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.
నాలుగేళ్లు స్నేహం పేరుతో ఏమీ చేయకుండా కామ్ గా ఉన్న బాబు.. ఇప్పుడు మాత్రం మోడీ పై తీవ్ర విమర్శలు చేయటం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తుంటే.. ఆయన్ను అడ్డుకోవాలన్న పిలుపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీని ఏపీ ప్రజలు అడ్డుకోవాలని.. నిలదీయాలని.. ఏపీ ప్రజలు ఎలా చస్తున్నది చూసేందుకే వస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్న బాబు మాటల వెనుక అసలు కహానీ వేరుగా చెబుతున్నారు.
జనవరి ఆరున ఏపీ నడిబొడ్డు లాంటి గుంటూరు కు ప్రధాని మోడీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో బాబును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. బీజేపీ నేతలు సైతం ఇదే వాదనను వినిపిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఏపీకి తాము ఎంత చేసిన విషయాన్ని చెప్పటంతో పాటు.. నాలుగేళ్ల పొత్తు సందర్భంగా బాబు కేంద్రానికి అందించిన సహాయ సహకారాల వివరాల చిట్టా విప్పుతారని.. ప్రత్యేక హోదా విషయంలో బాబు రిక్వెస్ట్ లను బయట పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు.
ఇప్పటికే తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబును చిన్నబుచ్చుతూ.. కేసీఆర్ ను పొగిడేసే మోడీ.. తాజా సభలోనూ అలాంటి పని చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలు తెలిసిన చంద్రబాబు.. ముందుగానే మోడీకి కౌంటర్ ఇవ్వటం ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మాటకారి మోడీ బాబు గుట్టు రట్టు ఏ రీతిలో చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.