Begin typing your search above and press return to search.

ఒక్కో చోట ఒక్కో తీరునా: క‌రోనా వైర‌స్ కొత్త ‌పుంత‌లు తొక్కిందా..?

By:  Tupaki Desk   |   3 May 2020 2:30 PM GMT
ఒక్కో చోట ఒక్కో తీరునా: క‌రోనా వైర‌స్ కొత్త ‌పుంత‌లు తొక్కిందా..?
X
ఒక్కో చోట ఒక్కో తీరున క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. అన్ని చోట్ల ఆ వైర‌స్ ప్ర‌భావం ఒకే తీరున ఉండ‌డం లేద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ క్ర‌మంలో వైర‌స్‌ లో మార్పులు వ‌స్తున్నాయ‌ని.. తెలుస్తోంది. ఆ విధంగానే వైర‌స్ ప్ర‌భావం ఉంది. భారత‌దేశం‌లో కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) చెందిందా లేదా అనే దిశగా అధ్యయనం చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఈసీఎంఆర్‌) సిద్ధ‌మ‌వుతోంది. కొవిడ్‌ వైరస్‌ స్ట్రెయిన్ ‌(జాతి)లో మార్పు జరిగిందో లేదో తెలుసుకుంటే మందు క‌నుక్కోవ‌డానికి దోహ‌దం చేస్తుంద‌ని భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే వైరస్‌ తీవ్రత - వ్యాప్తి సామర్థ్యం కూడా ఈ అధ్యయనంలోనే తేలుతుందని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా రోగుల నుంచి నమూనాలు సేకరించి ప‌రిశీలించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌బ‌లుతున్న కరోనా వైర‌స్ భార‌త‌దేశంలోని వైర‌స్ వేరు అని, 0.2-0.9 మధ్య మాత్రమే తేడా ఉందని గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ ఏఐడీ) వెల్ల‌డించిందిది. ఇన్‌ ఫ్లూయెంజా వైరస్‌ సీక్వెన్స్‌ను ఎపిడిమియోలాజికల్‌ డేటాను ప‌రిశీలిస్తోంది.

ఈ నేప‌థ్యంలో దేశంలో ఇప్పటివరకు 3 రకాల వైర‌స్ లను గుర్తించారు. ఒకటి వూహాన్‌ నుంచి - మిగిలిన రెండూ ఇటలీ - ఇరాన్‌ నుంచి వచ్చాయి. అయితే వాటిలో ఇరాన్‌ - చైనా నుంచి వచ్చిన స్ట్రెయిన్స్‌ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆ విధంగా ఎందుకున్నాయి.? అనేది అర్థం కావ‌డం లేదు. దీనిపై అధ్యయనం చేయడానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ యోచిస్తోంది. సార్స్‌–కోవిడ్‌2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడంతో దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వైరస్ మ‌రింత బలంగా త‌యార‌వుతోందా? మరింత త్వరగా వ్యాప్తి చెందుతోందా అనే విషయమై అధ్య‌య‌నంలో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కరోనా వైరస్‌ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనా వేయడానికి క‌రోనా వైర‌స్ బాధితు‌ల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేయ‌నున్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గుర్తించ‌డంతో ఆ తేడా ఎందుకు ఉంద‌ని ప్రశ్నిస్తున్నారు. మనదేశంలోకి ప్రవేశించిన వైరస్‌ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని - అన్నిరకాల వైరస్‌ లలో ఒకేరకం ఎంజైములు ఉండడంతో టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు.

అయితే భారత్‌ లోకి వైర‌స్ ప్ర‌బ‌లి మూడు నెలలు అవుతోంది. ఇంత మార్పులకు గురికాలేదని ఐసీఎంఆర్ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అయితే అది అవాస్త‌వ‌మ‌ని తేలింది. ఆ వైర‌స్ కొత్త పుంత‌లు తొక్కుతుండ‌డంతో మందు క‌నిపెట్టేందుకు క‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఆ వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పని చేస్తున్నాయి. దాదాపు 70 వ్యాక్సిన్‌ లు పరీక్షించారు. వాటిలో మూడు మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరాయి. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్‌ ప్రజల వినియోగానికి రాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.