Begin typing your search above and press return to search.

హరీష్ లీవ్.. కేబినెట్ లో నో చాన్స్.?

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:21 AM IST
హరీష్ లీవ్.. కేబినెట్ లో నో చాన్స్.?
X
టీఆర్ ఎస్ లో ఏదో జరుగుతోంది.. ఏం జరుగుతోందనేది కేసీఆర్, కేటీఆర్ మదిలో మాత్రమే ఉంది. బలమైన, సీనియర్ వ్యక్తులను ఈ కేబినెట్ లో దూరం పెడుతారన్న చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. తాజాగా అందుకు బలాన్నిచ్చే సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

తెలంగాణ ఏర్పాడ్డాక తొలి కేబినెట్ లో భారీ నీటి పారుదల శాఖ సహా అసెంబ్లీ వ్యవహారాలు కీలక శాఖలు చూసిన హరీష్ రావుకు ఈసారి మంత్రి పదవి దక్కదనే ప్రచారానికి బలం చేకూర్చేలా తాజా సంఘటన జరిగింది.

మాజీ మంత్రి హోదాలో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఉంటున్న హరీష్ రావు తాజాగా తనకు కేటాయించిన మినిస్టర్ బంగ్లాను ఖాళీ చేశారు. ఇప్పుడీ అంశం టీఆర్ ఎస్ శ్రేణులను.. హరీష్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ కేబినెట్ విస్తరిస్తున్నారు. పోయిన సారి మంత్రులుగా చేసిన వారందరూ మినిస్టర్ బంగ్లాలోనే ఉంటున్నారు. కానీ హరీష్ రావు మాత్రం తన బంగ్లాను ఖాళీ చేయడంతో ఆయనకు మంత్రి పదవి దక్కదన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. కొత్త ప్రభుత్వంలో హరీష్ కు మంత్రిపదవి రాదన్న వాదనకు ఈ సంఘటన ప్రధాన సాక్ష్యంగా కనపడుతోంది. మంత్రి పదవి దక్కదని హరీష్ రావు ఖాళీ చేశాడా.? లేక టీఆర్ ఎస్ అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు అంది ఖాళీ చేశాడా అన్నది ఇప్పుడు టీఆర్ ఎస్ లో చర్చనీయాంశమైంది.