Begin typing your search above and press return to search.
భారీ నీటి పారుదల హారీష్ కు లేనట్టేనా..!?
By: Tupaki Desk | 3 Jan 2019 11:49 AM GMT"మంత్రి హారీష్ రావు నీళ్ల మంత్రి అయిన కాడినుంచి 24 గంటలు కష్టపడుతున్నాడు. అన్నం, నిద్ర వదిలేసి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాడు."
"తెలంగాణకు నీళ్లు ఇచ్చేంటందుకు ఇక్కడి భూములను సస్యశ్యామలం చేసేటందుకు మీ నీళ్ల మంత్రి కష్టపడుతున్నాడు."
"హరీష్ రావు నీళ్ల మంత్రి కాగానే ఇంటికే పోవటం లేదు."
ఇవి తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో జరిగినా ప్రచార సభలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రసంగాలు. ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే హారీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి అవుతారని అందరూ ఆశించారు. అంతే కాదు ఆయన అయితేనే తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల పనులు సరైన సమయానికి పూర్తి అవుతాయని అనుకున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసాయి. ఫలితమూ తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వచ్చింది. హరీష్ రావు రికార్డు స్దాయిలో మెజారిటి సాధించి గెలుపొందారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ ప్రారంభమయ్యింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు మహ్మమూద్ ఆలి చేత మాత్రమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడుంటుందో తెలియడం లేదు. అయితే మిగిలిన శాఖలు ఎలా ఉన్నా, నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం కేసీఆర్ చాలా శ్రద్ద చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి పలు భారీ ప్రాజెక్టులను సందర్శించారు. తొలుత కాళేశ్వరం ప్రాజేక్టు పనులు పరిశీలించిన కేసీఆర్ అక్కడి పనుల తీరు పై అధికారుల పై మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్ నాటికి, ఏసాంగి నాటికి నీరు ఇవ్వాల్సిందే నంటూ ఆదేశించారు. దీంతో పాటు అన్నారం బ్యారేజీని కూడా సందర్శించారు. ప్రతీ ప్రాజేక్టుకు వెళ్లిన కేసీఆర్ పనుల తీరు పై అధికారులతో సమీక్షలు జరిపారు. నీటి విడుదలకు గడువు విధించారు. ఇవన్నీ చూస్తుంటే మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావు కు భారీ నీటి పారుదల శాఖ కాకుండా మరేదైన శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే నిర్ణయం తీసుకుంటే నీటిపారుదల శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకునే అవకాశం ఉంది.