Begin typing your search above and press return to search.
కేఏ పాల్.. చానళ్లకు డబ్బులు ఇస్తున్నాడా?
By: Tupaki Desk | 24 Jan 2019 12:25 PM GMTతాము వార్తల్లో ఉండాలంటే.. ఇరవై నాలుగు గంటల వార్తా చానళ్లలో కనిపించాలనేది కొంతమంది ఆలోచన. చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఏదో లా వార్తల్లో ఉండటం, అలా వార్తల్లో ఉండటానికి.. ఎదురుడబ్బులు ఇచ్చుకోవడానికి కూడా సదరు వ్యక్తులు వెనుకాడటం లేదు. మీడియా కూడా వ్యాపారమయం అయ్యింది కాబట్టి.. డబ్బులు తీసుకుని ఇంటర్వ్యూలు, వార్తలు ఇచ్చే చానళ్లు చాలానే తయారు అయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో ఇదే పద్ధతినే వాడుకొంటూ… మత ప్రచారకుడు కేఏ పాల్ వార్తల్లోకి వస్తున్నాడని టాక్. ఇన్నాళ్లూ ఈ పాల్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ఇతడు మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. చానళ్లు కూడా పాల్ తో వరస పెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. దీని వెనుక కథ ఏమిటి.. అంటే, పాల్ చానళ్లకు ఎదురుడబ్బులు ఇచ్చి తన ఇంటర్వ్యూలు వేయించుకుంటున్నాడని టాక్.
పాల్ మత బోధనల నేపథ్యంలో ఇతడికి ఫండ్స్ కొదవలేదు. దీంతో ఇలా చానళ్లకు డబ్బులు ఇచ్చే స్తోమత ఇతడికి ఉంది. దీంతో చానళ్లకు డబ్బులు కుమ్మరించి తన ఇంటర్వ్యూలు వచ్చేలా చూసుకుంటున్నాడట.
మరి ఇంత చేసి పాల్ సాధించేది ఏమిటి? అంటే ఏమీ లేదు. పాల్ ఇంటర్వ్యూలు యథారీతిన కామెడీ అవుతున్నాయి. అప్పుడెప్పుడో ఎన్నికల ముందు కూడా ఇతడు ఇలాగే హడావుడి చేశాడు. తీరా చూస్తే… లాప్ టాప్ పోయిందని, అందుకే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నట్టుగా ఇతడు ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు వచ్చి.. అలాంటి కామెడీనే చేస్తున్నాడు!