Begin typing your search above and press return to search.
మిస్టర్ మోడీ.. బాబు చెప్పినట్లే చేయండి!
By: Tupaki Desk | 26 Dec 2018 11:33 AM GMTప్రధాని మోడీ అయితేనేం.. నచ్చినప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టటమే కాదు.. ఇంద్రుడు.. చంద్రుడని కీర్తిస్తాం. తేడా వస్తే.. అంతేలా పాతాళంలోకి తొక్కేస్తాం. కురచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి చంద్రబాబుకు చేతకానిది ఏముంది చెప్పండి. పెద్ద నోట్ల రద్దు సమయంలో మోడీ లాంటి మొనగాడు ఎవరూ ఉండరని.. ఆయన తీసుకున్న నిర్ణయం బ్రహ్మాండం అంటూ ఆకాశానికి ఎత్తేసిన బాబు.. ఇప్పుడు అదే అంశం పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నది అందరికి తెలిసిందే.
మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యం లో మోడీని ప్రతి యాంగిల్ లోనూ తప్పు పడుతున్న బాబు.. తాజాగా కొత్త పల్లవిని పాడుతున్నారు. వచ్చే నెల ఆరున ఏపీకి వచ్చే మోడీ ఏమేం చేయాలో.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలో బాబే డిసైడ్ చేస్తున్న తీరు చూస్తున్నదే. ఏపీకి ఏమీ చేయటం లేదంటూ గుండెలు బాదేసుకుంటున్న చంద్రబాబు.. నాలుగేళ్లు ఫ్రెండ్ షిప్ చేస్తున్న వేళ. . ఈ సంగతులన్ని ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఏపీ పర్యటనకు మోడీ రాకూడదని.. వస్తేగిస్తే.. ఎక్కడకు రావాలో కూడా చెప్పేస్తున్న చంద్రబాబు.. మోడీ తాజా పర్యటనతో ఏపీ ప్రజలకు కారం రాసినట్లు ఉంటుందని చెబుతున్నారు. మరిన్ని తెలిసిన పెద్ద మనిషికి.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళితే తెలంగాణ ప్రజలకు ఎంత చికాకుగా ఉంటుందన్న విషయాన్ని ఎందుకు మిస్ అయ్యారో అర్థమే కాదు.
ఏపీకి వస్తున్న మోడీ.. పోలవరం ప్రాజెక్టును చూసేందుకో.. రాజధానిని చూసేందుకు రావాలే కానీ.. వేరే కార్యక్రమాలు పెట్టుకోవటమా అని ఫైర్ అవుతున్నారు. నిన్నటి వరకూ తన గురిని మోడీకి పరిమితం చేసిన ఆయన.. ఇప్పుడు దాన్ని మరింత విస్తృతి చేయటం కనిపిస్తోంది.మోడీ పర్యటనను వ్యతిరేకించాలంటూ జగన్.. పవన్ ల మీద పడుతున్నారు. తన మాదిరే.. మోడీ ఏపీ పర్యటనను వ్యతిరేకించాలని చెబుతున్న బాబు.. తన మాటలతో సెంటిమెంట్ రగిలేలా చేసి.. జగన్.. పవన్ లను సైతం తాను చెప్పినట్లుగా ఆడాలన్నట్లుగా చెబుతున్న మాటలు ఏపీ ప్రజలకు మండేలా చేస్తున్నాయి.
మోడీ మీద వ్యతిరేకతను బాబు తన మాటలతో చెప్పే వరకూ ఓకే. కానీ.. ఆ పేరుతో తన రాజకీయ ప్రత్యర్థులైన జగన్.. పవన్ ల మీద పడటంలో అర్థం లేదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలన్న బాబు కుత్రంతం ప్రజలకు అర్థమయ్యే కొద్దీ.. ఆయన్ను ఛీ కొట్టే పరిస్థితి తధ్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మాట్లాడే ముందు కాస్త చూసుకోండి చంద్రబాబుగారూ!