Begin typing your search above and press return to search.

ఉత్తరప్రదేశ్ పై మోడీ ఆశలు వదిలేశాడా?

By:  Tupaki Desk   |   1 July 2021 3:30 AM GMT
ఉత్తరప్రదేశ్ పై మోడీ ఆశలు వదిలేశాడా?
X
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏకంగా 70కు పైగానే ఎంపీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇదీ. ఇక్కడి జనాభా చాలా పాశ్చాత్యా దేశాల కంటే కూడా ఎక్కువ. అంత పెద్ద రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలోకి రావడం ఈజీ. యూపీ ప్రజల తీర్పునే దేశంలో అధికారంలోకి ఎవరు వస్తారన్నది డిసైడ్ చేస్తుంది.

గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిన నేతలందరినీ పక్కనపెట్టి ఎంపీ, యోగి అయిన ఆధిత్యనాథ్ ను సీఎం సీట్లో కూర్చుండబెట్టింది బీజేపీ అధిష్టానం. అయితే ఆయన దూకుడు, హిందుత్వ విధానాలు, కరోనా ఫెయిల్యూర్ తో బీజేపీకి ఆ రాష్ట్రంలో నూకలు చెల్లే పరిస్థితి వచ్చిందని టాక్ నడుస్తోంది. సంఘ విద్రోహ చర్యలు పెరిగిపోవడం.. తుపాకీ రాజ్యం, అత్యాచార కేసులు, దళితులపై దాడులు ఇలా చెప్పలేనన్ని దారుణాలకు యూపీ అలవాలంగా మారిందన్న ఆరోపణలున్నాయి..

యోగి సర్కార్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈసారి అఖిలేష్-మాయావతి కూటమిదే విజయం అన్న అంచనాలు వెలువడుతున్నాయి.దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఇక కేంద్రంలో అధికారంలోకి రావడం కానకష్టమన్న సంగతి బీజేపీకి ఖచ్చితంగా తెలుసు.

అందుకే యూపీపై ఆశలు పోతున్న దశలో మోడీ రంగంలోకి దిగుతున్నారు.పెద్ద రాష్ట్రానికి ఎన్నడూ లేనంతా ఈసారి 8 కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. అందరూ యువకులు, ఉత్సాహవంతులు, సామాజిక కోణంలో మంత్రి పదవులు ఇచ్చి యూపీలో మరోసారి ప్రజలను ఆకట్టుకోవాలని మోడీ ప్లాన్ గీస్తున్నాడట.. కానీ మోడీ ఆశలు నెరవేరడం కష్టం.. యోగి పాలనపై వ్యతిరేకత బాగా ఉందని.. చివరి ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడి రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.