Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ లో చేరబోతున్న నందమూరి సుహాసిని.?
By: Tupaki Desk | 8 Jan 2019 12:43 PM GMTహరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని త్వరలో టీఆర్ ఎస్ పార్టీలో చేరబోతున్నారా.? ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయం జరిగిందా.? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కూకట్ పల్లిలో కచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో హరికృష్ణ కుమార్తెను పావుగా వాడుకుని తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు చేయాలని చూశారని రీసెంట్ గా కేసీఆర్ విమర్శించారు. అదే ప్రెస్ మీట్ లో.. సుహాసిని పై జాలి కూడా చూపించారు కేసీఆర్. ఓడిపోయన తర్వాత ఒక్కసారి అయినా సుహాసినికి ఫోన్ చేసావా అంటే ఎద్దేవా చేశారు.
కూకట్ పల్లిలో ఓడిపోవడం, చంద్రబాబు పావుగా వాడుకున్నాడనే జాలి.. మొత్తానికి నందమూరి సుహాసిని పై కేసీఆర్ కు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. దీంతో.. ఆమెను తమ పార్టీలోకి తీసుకుని.. ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట. దీని ద్వారా కేసీఆర్ కు రెండు లాభాలు. ఒకటి… సుహాసినికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా తాము ఆంధ్రావాళ్లని కూడా కలుపుకుని పోతామని ఫీలింగ్ క్రియేట్ చేయడం. రెండోది.. సుహాసిని ద్వారా ఆంధ్రా రాజకీయాల్లో ఎంటర్ అవ్వడం.
సుహాసినిని తమ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా… ఆంధ్రా ప్రాంతంలో తమపై ఉన్న సాఫ్ట్ కార్నర్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. దీనిద్వారా చంద్రబాబు మంత్రాంగానికి కూడా చెక్ పెట్టొచ్చు అనేది కేసీఆర్ భావన. అయితే మరి రాజకీయా వర్గాల్లో విన్పిస్తున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే.. రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం సుహాసిని లేదని మరో వాదన విన్పిస్తోంది.