Begin typing your search above and press return to search.

కొడాలి నానికి ఈ మాదిరి క్లాస్ ఎవరూ తీసుకోలేదేమో...?

By:  Tupaki Desk   |   20 Aug 2022 7:30 AM GMT
కొడాలి నానికి ఈ మాదిరి క్లాస్ ఎవరూ తీసుకోలేదేమో...?
X
ఆయనను ఫైర్ బ్రాండ్ అంటారు. గతంలో ఫైర్ బ్రాండ్ అంటే ఉన్నది ఉన్నట్లుగా గట్టిగా మాట్లాడేవారిని అనేవారు. ఇపుడు మాత్రం బూతులు మాట్లాడేవారికి ఆ ట్యాగ్ తగిలిస్తున్నారు. అలా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ బ్రాండ్ ముద్రతో ఉన్నారు. అయితే నాని మూడేళ్ళు మంత్రిగా తన శాఖ గురించి పెద్దగా మాట్లాడింది లేదు అన్నది అందరి భావన. అదే సమయంలో నాని టీడీపీ అధినేత చంద్రబాబు మీద కామెంట్స్ చేయాల్సి వస్తే నల్లేరు మీద బండి మాదిరిగా విరుచుకుపడతారు అని పేరుంది.

ఇక చంద్రబాబుని ఉద్దేశించి ఏకవచనంతో పిలవడం అలాగే వాడు వీడు, పనికిమాలిన వెధవ అని తిడుతూ ఉంటారు. నిజానికి రాజకీయాలలో ఇలాంటి పదాలను ఎవరూ వాడరు, తమకు ఎంత పడకపోయినప్పటికీ కొన్ని మర్యాదల హద్దులను దాటి వెళ్ళరు. కానీ కొడాలి నాని మాత్రం చంద్రబాబుని ఏమీ కాకుండా మాట్లాడేస్తూంటారు. ఇది ఎలా ఉందీ అంటే బాబు అంటే ఆయన రాజకీయాలు అంటే పడని వారు కూడా అయ్యో పెద్దాయనను పట్టుకుని అలా అనవచ్చా అనేలా ఉంది.

ఇక పోతే సినీ నటుడు కం నిర్మత, కమ్ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా బండ్ల గణేష్ ఉంటారు. ఆయన ఈ మధ్య ఎందుకో చంద్రబాబుని తెగ పొగుడుతున్నారు. హైదరాబాద్ లో ఒక మూల నుంచి చూస్తే మనం వేరే దేశంలో ఉన్నామా అన్న భావన కలుగుతోంది అని రీసెంట్ గా కామెంట్ చేసారు. అందతా బాబు సీఎం గా ఉన్నపుడు చూపిన ముందు చూపు చొరవ వల్లనే సాధ్యపడింది అని కూడా అన్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు మీద కొడాలి నాని చేస్తున్న అసభ్య పదజాలం మీద బండ్ల గట్టిగానే విరుచుకుపడ్డారు. నాని ఇది నీకు తగునా అని సూటిగానే అడిగేసారు. బాబు అంటే పడకపోతే గమ్మున ఉండు. లేదా మాట్లాడేటపుడు భాష గురించి ఆలోచించు అని క్లాస్ తీసుకున్నారు. బాబుని పట్టుకుని వాడు వీడు అనడమేంటి అని గుస్సా అయ్యారు. ఏ చంద్రబాబు అయితే నీకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చ్ రాజకీయ బిక్ష పెట్టారో ఆయన గురించి అలా మాట్లాడడం కరెక్టేనా నానీ అని కూడా నిగ్గదీశారు.

నీవు మాట్లాడుతున్న భాష కరెక్టో కాదో నీ భర్యాబిడ్డలను వెళ్ళి అడుగు అని కూడా సలహా ఇచ్చారు. ఎక్కడో హరిక్రిష్ణ పక్కన సెక్యూరిటీగా ఉన్న కొడాలి నాని మంత్రి అయ్యారు ఈ రోజు అది ఆయనకు దక్కిన పొలిటికల్ లక్. వైసీపీలో జగన్ దయతో అది సాధ్యమైంది. దానికంటే ముందు ఎమ్మెల్యేగా చేసిన ఘనత బాబుది కాదా అని నిలదీశారు.

చంద్రబాబు మీద ఎంత కోపం ఉన్నా తన మూలాలు, రాజకీయంగా తన ఉనికి టీడీపీతోనే మొదలైంది అన్నది నాని ఎప్పటికీ మరచిపోకూడని కూడా బండ్ల పేర్కోండం విశేషం. ఇక కొడాలి నాని వల్లభనేని వంశీలు బాబుని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం బాధాకరం దారుణం అని కూడా అన్నారు. ఇదే తీరున పేర్ని నాని గుడివాడ అమరనాధ్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారని కుల రాజకీయాలు చేయడం ఎవరి మెప్పు కోసమో అయినా ఇలా మాట్లాడడం వల్ల చివరికి వారే నష్టపోతారని అన్నారు.

ఇక పనిలో పనిగా తెలంగాణా సీఎం కేసీయార్ ని పొగిడారు. బీజేపీ వారికే హిందూ భక్తి లేదని, వందల కోట్లతో యాదాద్రిని కట్టించిన కేసీయార్ కంటే భక్తుడు ఎవరైనా ఉంటారా అని బండ్ల లాజిక్ పాయింట్ నే లాగారు. చల్లగా ప్రశాంతగా ఉండే హైదరాబాద్ లోనూ తెలంగాణాలోనూ మత రాజకీయాలు జొప్పించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని బండ్ల సంచలన కామెంట్స్ చేశారు.